`ఆచార్య` వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన చిత్రం `గాడ్ ఫాదర్`. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్` కు రీమేక్ ఇది. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు.
ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసిన ఈ చిత్రం.. 2వ రోజు సైతం అదరగొట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 12.97 కోట్ల రేంజ్లో షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. రెండొవ రోజు రూ. 7.73 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 9.67 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది. ఇక ఏరియాల వారీగా గాడ్ ఫాదర్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 5.67 కోట్లు
సీడెడ్: 5.14 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.27 కోట్లు
తూర్పు: 2.11కోట్లు
పశ్చిమ: 1.04 కోట్లు
గుంటూరు: 2.35 కోట్లు
కృష్ణ: 1. 22 కోట్లు
నెల్లూరు: 0. 90 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ= 20.70 కోట్లు(34.75 కోట్లు~ గ్రాస్)
————————————-
కర్ణాటక: 2.30 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 1.80 కోట్లు
ఓవర్సీస్ – 2.55 కోట్లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 27.35కోట్లు(50.35 కోట్లు~ గ్రాస్)
——————————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 91 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలవాలంటే.. మొదటి రెండు రోజులు వచ్చిన వసూళ్లు కాకుండా ఇంకా రూ. 64.65 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఈ టార్గెట్‌ను చిరు అందుకుంటాడా.. లేదా.. అన్నది చూడాలి.