మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. `మెగా 154` వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. యంగ్ డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మితం అవుతోంది. ఇందులో చిరంజీవికి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుంటే.. రవితేజ సరసన కేథరిన్ థ్రెసా అలరించబోతోంది.
వైజాగ్ జాలరీపేట బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీరయ్య` అనే టైటిల్ దాదాపు కన్ఫార్మ్ అయిపోయింది. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిరుతో కలిసి రవితేజ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం వీరిద్దరిపై బాబీ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీకు పెడుతున్న బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఈ మూవీకి మేకర్స్ రూ. 150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. అయితే అందులో రెమ్యునరేషన్లకే రూ.75 కోట్లు ఖర్చు అవుతుందట.
చిరంజీవికి అటు ఇటుగా రూ.40 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఉంటుంవగ. రవితేజకి రూ.18 కోట్లు, శ్రుతి హాసన్‌కు రూ. 3 కోట్లు, దర్శకుడు బాబీకి రూ. 6 కోట్లు ఇస్తున్నారని టాక్ ఉంది. ఇక మిగిలిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు కలుపుకొని రూ.75 కోట్లు బడ్జెట్ వరకు అవుతుందట. ఏదేమైనా `ఆచార్య` వంటి భారీ ఫ్లాప్ తర్వాత కూడా చిరు మూవీకి ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…