మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవికి ఇది 154వ ప్రాజెక్ట్ కావడంతో..`మెగా 154` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రను పోషిస్తున్నారు.
పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చేయడాది సంక్రాంతికి కానుక విడుదల కానుంది.
ఇదిలా ఉంటే..ఈ మూవీ యూనిట్ కి లీకుల వీరులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా ఊర మాస్ లుక్ లో ఉన్న చిరు పిక్స్ ను లీక్ చేసేశారు. అభిమానులనే కాదు నెట్టిజనులను సైతం ఈ పిక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిరు ఆహార్యం ఆద్యంతం మాస్ ని తలపిస్తుంది.
ప్రస్తుతం ఈ లీకెడ్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు సైతం ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అయితే లీక్ నేపథ్యంలో యూనిట్ వెంటనే దిద్దుబాటు చర్యల్ని షురూ చేసినట్లు తెలుస్తోంది.
https://newsorbit.com/entertainment-news/chiranjeevi-mega-154-movie-digital-rights-sold.html