NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Chiranjeevi: ఉద‌యం లేవ‌గానే చిరంజీవి ఎవ‌రి ఫోటో చూస్తారో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

Chiranjeevi: సాధార‌ణంగా ఉద‌యం లేవ‌గానే చాలామంది దేవుడి ఫోటో చూసి తమ రోజును ప్రారంభిస్తారు. అలాగే కొందరు నిద్ర లేవగానే తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్ద ఆశీస్సులు తీసుకుంటారు. అలా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉదయం లేవగానే ఒకరి ఫోటో చూసే అలవాటు ఉందట. అయితే ఆ ఫోటో దేవుడిది కాదు. అలాగే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులది కూడా కాదు. వీరు కాకుండా చిరంజీవి రోజు ఉదయం లేవగానే ఎవ‌రి ఫోటో చూస్తారో తెలుసా.. మహానటి సావిత్రి. అవును మీరు విన్నది నిజమే. తాజాగా విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి గారు తెలియ‌ని వారు ఉండ‌రు. వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన మ‌హాన‌టి ఆమె. న‌ట‌న కోస‌మే పుట్టిన అందాల తార‌. 8 ఏళ్ల వయసులోనే స్కూలుకు డుమ్మా కొట్టి నాటకాల గుంపులో చేరిన సావిత్రి.. 13 ఏళ్ల వయసులో హీరోయిన్ గా మారారు. త‌న‌దైన నటన శైలితో అనతి కాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్నారు. 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో 250 కి పైగా సినిమాలు చేశారు. నటిగా ఉన్నత స్థాయికి చేరుకున్న సావిత్రి.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 46 ఏళ్ల వయసులో కన్నుమూసి చిత్ర పరిశ్రమను, కోట్లాదిమంది అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేశారు.

ఇక సావిత్రి చనిపోయిన తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మహానటి పేరుతో ఆమె బయోపిక్ ను వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది అలాగే 2007లో సావిత్రి జీవిత చరిత్రను ఒక పుస్తకం రూపంలో రిలీజ్ చేశారు. తాజాగా సావిత్రి క్లాసిక్స్ అనే మరో బుక్ విడుదల అయింది. సావిత్రి సినీ ప్రస్థానం వివరిస్తూ సావిత్రి క్లాసిక్స్ పేరుతో సంజయ్‌ కిశోర్ ఈ బుక్ ను రచించారు. ఈ బుక్ ఆవిష్క‌ర‌ణ మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ చేతుల మీద‌గా మంగళవారం జ‌రిగింది.

లాచింగ్ ఈవెంట్ ను సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌గా.. మురళీమోహన్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి తదితరులు అతిథులుగా హాజ‌రు అయ్యారు. అయితే సావిత్రి క్లాసిక్స్ బుక్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో విజయ చాముండేశ్వరి చిరంజీవిని తొలిసారి కలుసుకున్న సందర్భంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

విజయ చాముండేశ్వరి ఒక‌సారి చిరంజీవి ఇంటికి వెళ్లార‌ట. ఆ స‌మ‌యంలో కాలికి గాయం ఉన్నా కూడా క‌ర్ర స‌హాయంతో చిరంజీవి మేడ‌పై నుంచి కింద‌కు వ‌చ్చార‌ట‌. విజయ చాముండేశ్వరికి ఎంతో మర్యాధ చేశారట. అలాగే తాను రోజు ఉదయం లేవగానే సావిత్రమ్మ ఫోటోనే చూస్తాన‌ని, త‌న‌ బెడ్ ఎదురుగా అమ్మ ఫోటోనే ఉంద‌ని చిరంజీవి విజయ చాముండేశ్వరితో చెప్పార‌ట‌. అంతేకాకుండా పైకి వెళ్లి ఆ ఫోటోని తీసుకువచ్చి విజయ చాముండేశ్వరికి చూపించారట.

తాజాగా విజ‌య చాముండేశ్వ‌రి స్వ‌యంగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. కొందరు చెప్పేది ఒకటి.. చేసింది మ‌రొక‌టి ఉంటుంది. కానీ చిరంజీవి విషయంలో మాత్రం ఆలోచన, మాట, ఆచరణ మూడు ఒకటే ఉంటాయని విజ‌య చాముండేశ్వ‌రి తెలిపారు. ఆపై చిరంజీవి సావిత్రి గారితో త‌నకున్న‌ అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. సావిత్రిగారంటే మా నాన్న‌కు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి ఆ మహానటి సినిమాలు చూస్తూ తెలియకుండానే చిన్నప్పటినుంచి నేను అభిమానం పెంచుకున్నాను. నా ఫ‌స్ట్‌ సినిమా పునాది రాళ్లు షూటింగ్ టైమ్ లో ఆమెని నేరుగా కలిసే అవకాశం వచ్చింది. సావిత్ర‌మ్మతో రెండు సినిమాలు చేశాను. న‌ట‌న ప‌రంగా ఆమె నుంచి ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాను. ఆవిడ ఆశీస్సులే నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచాయని నేను బ‌లంగా నమ్ముతాను. అందుకే రోజు నిద్ర లేవగానే ఆమె ఫోటోనే చూస్తాను` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

author avatar
kavya N

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju