Entertainment News సినిమా

బ‌ర్త్‌డే పిక్స్‌ను షేర్ చేసిన చిరు..ఆ క్షణాలు అద్భుతం అంటూ ట్వీట్‌!

Share

మెగాస్టార్ చిరంజీవి నిన్న‌(సోమవారం)67వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ ప్ర‌ముఖ‌ల నుంచే కాదు రాజ‌కీయ నాయ‌కులు, అభిమానుల నుంచి బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. అయితే ప్ర‌తిసారి ఇంట్లోనే వైభ‌వంగా పుట్టిన రోజును జ‌రుపుకునే చిరు.. ఆ సారి మాత్రం వేరె ప్రాంతంలో చేసుకున్నారు.

కామారెడ్డి జిల్లా దోమకొండలోని గడి కోటలో జరిగాయి. చిరు జన్మదిన వేడుకల్లో రామ్‌చరణ్‌ దంపతులతో పాటు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు బాబి దంప‌తులు, శ్రీజ కొణిదెల తదితరులు పాల్గొన్నారు. తాజాగా త‌న బ‌ర్త్‌డే పిక్స్‌ను చిరు ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

`ఈ పుట్టిన రోజును నా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా జరుపుకున్నాను. కుటుంబంతో కలిసి గడిపిన ఆ క్షణాలు అద్భుతం` అంటూ త‌న ట్వీట్ కు రాసుకొచ్చారు. ఇక ఈ పిక్స్‌లో చిరు ఫ్యామిలీతో స‌ర‌దాగా సంద‌డి చేస్తూ క‌నిపించారు. ప్ర‌స్తుతం చిరు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

కాగా, చిరంజీవి సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్‌`, మెహ‌ర్ రామేష్‌త్ `భోళా శంక‌ర్‌`, బాబీ డైరెక్ష‌న్‌లో `మెగా 154` చిత్రాలు చేస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూడు చిత్రాలు.. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాయి.


Share

Related posts

Prabhas : ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతులేసే వార్త చెప్పిన పూజా హెగ్డే..!!

sekhar

క్రేజీ కాంబినేషన్ “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ తో పవన్ మూవీ..??

sekhar

Liger : క్లైమాక్స్‌లో లైగర్..బాక్సాఫీస్ ఫైట్‌కి రెడి అవుతున్న పూరి – విజయ్

GRK