Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తాజా చిత్రమే `మేజర్`. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మూవీ.. జూన్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మూడు రోజులకే లాభాల బాట పట్టి బాక్సీఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
ఈ సినిమాపై సాధారణ ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి మెగా సపోర్ట్ కూడా అందింది. నిన్న ఈ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టగా.. నేడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. తాజాగా చిరు `మేజర్` టీమ్‌తో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ఈ సందర్భంగా `మేజర్ సినిమా కాదు.. ఒక ఎమోషన్. గొప్ప హీరో సందీప్ ఉన్నికృష్ణన్ కథను చాలా ఎట్రాక్టివ్ గా చూపించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మహేష్ బాబు ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలవడం ఎంతో గర్వంగా ఉంది. అడివి శేష్, శోభితా, సయీ మంజ్రేకర్, దర్శకుడు శశికిరణ్ తిక్క.. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్` అని రాసుకొచ్చారు. దీంతో చిరు పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…