తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, `కేజీఎఫ్` బ్యూటీ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రమే `కోబ్రా`. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇందులో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు కీలక పాత్రలను పోషించారు.
అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆగస్టు 31 తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుంచే యావరేజ్ టాక్‌ను మూటగట్టుకుంది. `కోబ్రా` అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయిందని అభిమానులు సైతం పెదవి విరిచారు.

అయితే టాక్ ఎలా ఉన్నా.. తొలి రోజు వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ తో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కానీ, 2వ రోజు మాత్రం ఈ మూవీ బాక్సాఫీస్ డీలా పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 2.28 కోట్ల షేర్‌ను వసూల్ చేసిన ఈ చిత్రం.. రెండొవ రోజు రూ. 66 లక్షల షేర్‌తో సరిపెట్టుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 17.10 షేర్‌ను రాబట్టింది. ఇక తెలుగులో కోబ్రా ఏరియాల వారీగా ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నిజాం: 0.86 కోట్లు
సీడెడ్: 0.35 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.52 కోట్లు
తూర్పు: 0.29 కోట్లు
పశ్చిమ: 0.26 కోట్లు
గుంటూరు: 0.25 కోట్లు
కృష్ణ: 0.27 కోట్లు
నెల్లూరు: 0. 14 కోట్లు
———————————
ఏపీ+తెలంగాణ =2.94 కోట్లు (4.90 కోట్లు~గ్రాస్)
———————————
ఇక వరల్డ్ వైడ్‌గా `కోబ్రా` గ్రాస్ వసూళ్లను గమనిస్తే..
తమిళనాడు: 17.60కోట్లు
తెలుగు రాష్ట్రాలు: 4.90 కోట్లు
కర్ణాటక: 2.80 కోట్లు
కేరళ: 2.05 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1.05 కోట్లు
ఓవర్సీస్: 4.45 కోట్లు
——————————————–
వరల్డ్ వైడ్ కలెక్షన్ = 32.85 కోట్లు గ్రాస్ (17.10 కోట్లు~ షేర్)
——————————————
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. మొదటి రెండు రోజుల్లో రూ. 2.94 కోట్ల షేర్‌ను రాబట్టింది కాబట్టి ఇంకా రూ. 2.06 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ వర్త్ బిజినెస్ రూ. 60 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.