33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

చాటుగా మాటేసి కాటేసే `కోబ్రా`.. అదిరిపోయిన‌ తెలుగు ట్రైల‌ర్!

Share

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `కోబ్రా`. కేజీఎఫ్ మూవీతో ఇండియా వైడ్‌గా పాపుల‌ర్ అయిన అందాల భామ శ్రీ‌నిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా న‌టించింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగ‌స్టు 31న ఈ చిత్రంతో త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లోనూ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న త‌మిళ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌.. నేడు తెలుగు ట్రైల‌ర్‌ను వ‌దిలారు. విల‌న్లు హీరోను త‌ల‌కిందులుగా వేలాడ‌తీసి కొడుతున్న స‌న్నివేశంలో మొద‌లైన ఈ ట్రైల‌ర్‌.. ఆధ్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ ఆక‌ట్టుకుంది.

`హి ఈస్ కోబ్రా. రకరకాలుగా రూపాలు మార్చడం తెలుసు .. చాటుగా మాటేసి కాటేయడం తెలుసు` అనే వాయిస్ ఓవర్ తో హీరో క్యారెక్ట‌ర్‌ను అద్భుతంగా ప్రాజెంట్ చేశారు. బయటికి ఓ సాధారణ మ్యాథ్స్ టీచర్ గా కనిపించే హీరో.. మ‌రోవైపు తన టాలెంట్ ను ఉపయోగించి రూపాలు మారుస్తూ అసాధ్యమైన క్రైమ్స్ ను చాలా ఈజీగా చేస్తుంటాడు.

అతడిని పోలీసులు అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ, దొర‌క్కుండా వారికి చుక్క‌లు చూపిస్తుంటాడ‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. అలాగే ఇందులో విక్ర‌మ్ విభిన్న గెట‌ప్స్‌లో అల‌రించ‌బోతున్నాడు. ఆయనను పట్టుకునే ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ నటించాడు. విజువ‌ల్స్‌, బ్యాక్ గ్రైండ్ మ్యూజిక్‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు, శ్రీ‌నిధి శెట్టితో ల‌వ్ ట్రాక్ వంటి అంశాలు కూడా బాగానే ఆక‌ట్టుకున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ట్రైల‌ర్ `కోబ్రా` సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను విక్ర‌మ్ ఏ మేర‌కు అందుకుంటాడో చూడాలి.


Share

Related posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పెట్టిన ఆ కండిషన్ తో ప్రొడ్యూసర్ కి ఫ్యూజ్ ఎగిరిపోయింది ??

sekhar

రానా తమ్ముడికోసం సురేష్ బాబు ఆ డైరెక్టర్ నే ఎందుకెంచుకున్నారో రివీల్ అయింది ..!

GRK

Manchu vishnu: మోసగాళ్ళు సినిమా చేసి మోసపోయిన మంచు విష్ణు..ఏదో అనుకుంటే ఇంకేదో అయింది..!

GRK