బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేనెల మొదటి వారం నుండి ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తాజా సీజన్ కి సంబంధించిన ప్రోమో..లోగో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమోలో ‘ఇక్కడ ఈ ఆట ఆగింది అంటే.. అక్కడ అసలైన ఆట మొదలైనట్టే.. లైఫ్లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే.. బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్కు అడ్డా ఫిక్స్’ అంటూ ప్రోమోలో నాగార్జున చెప్పిన డైలాగ్ ఇప్పటికే వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే మొదటి నుండి సీజన్ సిక్స్ లో జబర్దస్త్ షో కి చెందిన కమెడియన్స్ వస్తున్నట్లు వార్తలు రావడం జరిగాయి.
ముఖ్యంగా చలాకి చంటి పేరు వినబడుతూ ఉంది. అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… సదరు యాంకర్ చలాకి చంటి చాలా తెలివైన వ్యక్తి అని మేము విన్నాము జబర్దస్త్ షో మాదిరిగానే త్వరలో బిగ్ బాస్ షోలో కూడా తెలివిగా రాణించాలని కోరుకుంటున్నామని అనుకోకుండా నోరు జారేసాడు. ఈ క్రమంలో చలాకి చంటి బిగ్ బాస్ షో నిర్వాహకులు.. తనను కలిసిన సందర్భం వాస్తవమే.
కానీ రెండు విషయాలలో క్లారిటీ రావాల్సి ఉంది. అవి ఓకే అయితే హౌస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు చలాకి చంటి చెప్పుకొచ్చారు. దీంతో చంటి ఈసారి బిగ్ బాస్ 6 షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈసారి సీజన్ లో యాంకర్ ఉదయభాను ఇంకా పలువురు టాలీవుడ్ సీనియర్ సెలబ్రిటీలు షోలోకి రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈసారి సీజన్ లో అన్ని జాగ్రత్తలు షోనిర్వాహకులు తీసుకుంటున్నట్లు ఎటువంటి లీక్ లేకుండా చూసుకుంటున్నట్లు టాక్. గత సీజన్లలో వీకెండ్ ఎపిసోడ్లకు సంబంధించిన టాస్క్ లు.., ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఎలిమినేషన్ కి నామినేషన్ అయ్యారు అనే వాటికి సంబంధించి ముందే పేర్లు బయటికి వచ్చేసాయి. అయితే ఈసారి అటువంటి లీక్ లు లేకుండా షో నిర్వాహకులు జాగ్రత్తలు పడినట్లు సమాచారం.