దొంగ‌-పోలీస్‌గా చిరు, ర‌వితేజ‌.. మెగా మాస్ మూవీలో అవే హైలైట్ అట‌!

Share

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `మెగా 154` ఒక‌టి. యంగ్ డైరెక్ట‌ర్ బాబీ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ మెగా మాస్ మూవీకి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ దాదాపు క‌న్ఫార్మ్ అయింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇందులో చిరంజీవి–రవితేజ సవతి అన్నదమ్ములుగా నటించబోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుండీ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై మ‌రో క్రేజీ టాక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అదేవంటే.. ఈ సినిమాలో చిరంజీవి ఓ దొంగగా, రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నార‌ట‌. చిరంజీవిని పట్టుకోవడానికి రవితేజ వేేస ఎత్తుగడలు ఎంతో ఇంట్ర‌స్టింగ్ మ‌రియు సినిమాకు హైలైట్‌గా ఉంటాయ‌ని, టిట్‌ ఫర్‌ టాట్‌లా వీరిద్దరి న‌డుమ పోరు కొన‌సాగుతుంద‌ని టాక్ న‌డుస్తోంది.

మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే అటు మెగా, ఇటు మాస్ మ‌హారాజ్ ఫ్యాన్స్‌కు పండ‌గే అవుతుంది. కాగా, ఇప్ప‌టికే న‌ల‌బై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసిన మేక‌ర్స్‌.. మిగిలిన భాగాన్ని సైతం త్వ‌ర‌త్వ‌ర‌గా కంప్లీట్ చేసి 2023 జనవరిలో సంక్రాంతి కానుక‌గా సినిమాను విడుదల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

29 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago