NTR 30: `ఆర్ఆర్ఆర్`తో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. తారక్‌కు ఇది 30వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో గత ఏడాదే ఈ మూవీని అధికారికంగా అనౌన్స్ చేశాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణలు కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇదీ పాన్ ఇండియా చిత్రమే కాగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ బయటకు వచ్చింది.
అదేంటంటే.. ఈ సినిమా విడుదలకు మేకర్స్ డేట్ లాక్ చేశారట. వచ్చే ఏడాది మేలో ఈ మూవీని అట్టహాసంగా రిలీజ్ చేయబోతున్నారట. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే. అయితే ఆయన బర్త్‌డేకి ఒక్క రోజు ముందు అంటే మే 19, 2023న ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారని ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయంపై కొందరు నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఏడాది క్రితం ఈ మూవీని ప్రకటించిన మేకర్స్.. ఇప్పటి వరకు షూటింగ్‌ను స్టార్ట్ చేయలేదు కానీ, రిలీజ్ డేట్ లాక్ చేసేశారా అంటూ చురకలు వేస్తున్నారు. మరి ఇప్పటికైనా చిత్ర టీమ్ షూటింగ్‌ను ప్రారంభించి.. బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇస్తారో లేదో చూడాలి.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…