హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్న న్యాచురల్ స్టార్ నాని త్వరలోనే `దసరా` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగు రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని పూర్తిస్థాయి మాస్ పాత్రలో అలరించబోతున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

అయితే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను ఏదైనా గ్లింప్స్ లేదా టీజర్ వస్తుందని అభిమానులు భావించారు. కానీ, మేకర్స్ ఏకంగా ఫస్ట్ సింగిల్‌నే బయటకు వదిలారు. `ధూమ్ ధామ్ దోస్తాన్` అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ, గొన్నారా దస లక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి, నరసన్న, కాసర్ల శ్యామ్ కలిసి ఆలపించారు.
మాస్ లుక్‌లో ఉన్న నాని ఊరమాస్ స్టెప్స్‌తో అదరగొట్టేశారు. అభిమానులను మరియు మాస్ ప్రేక్షకులను ఈ సాంగ్ వేరె లెవల్‌లో అలరిస్తోంది. మరి లేటెందుకు దసరా ఫస్ట్ సింగిల్‌పై మీరు ఓ లుక్కేసేయండి.
https://newsorbit.com/cinema/actor-nani-interesting-comments-on-his-cine-career.html