టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖుషీ`. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అయిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్ డ్రాప్లో విభిన్నమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉండబోతుందట. నెగిటివ్ షేడ్స్ తో సాగే కశ్మీర్ కుర్రాడిగా విజయ్ కనిపించబోతున్నారట. అయితే ఆయన క్యారెక్టర్ చివరకు ఎమోషనల్ గా ఎలా టర్న్ తీసుకుంటుంది ?, పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ గా ఎలా మారింది ? అనేదే మెయిన్ పాయింట్ అని అంటున్నారు.
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే.. మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!