Devatha: చిన్నయి వచ్చి అమ్మా రా అని వాళ్ళ నాన్న గదిలోకి రమ్మని పిలుస్తుంది. ఆ రూమ్ లోకి నేను వచ్చేది ఏంటి చిన్నయి.. నేను రాను అని అంటుంది. నువ్వు ఏమి మాట్లాడకుండా నాతో పాటు రమ్మని చిన్మయి రుక్మిణి ని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఒక రాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాటిని చూడమని చిన్మయి చెబుతుంది .. రుక్మిణి వాటిని చూసి షాక్ అవుతుంది.
మాధవ్ పక్కన తను ఉన్న ఫోటో ఒకటి. అలాగే వాళ్ళిద్దరూ పెళ్లి ముహూర్తానికి రాయించుకున్న శుభలేఖ, తాళిబొట్టు కనిపిస్తాయి. వాటిని చూసి రుక్మిణి షాక్ అవుతుంది. అమ్మానాన్న ఎలాంటి వాడో తెలుసుకున్నావు కదా.. నువ్వు తొందరగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చిన్మయి అంటుంది. వెళ్ళిపోతాను బిడ్డ ఇంత దూరం వచ్చాక ఇంకా ఈ ఇంట్లో నేను క్షణం కూడా ఉండను అని రుక్మిణి మనసులో అనుకుంటూ ఉంటుంది.
అంతలో ఆదిత్య ఫోన్ చేస్తాడు . వాళ్ళ అమ్మకు ఎక్కడో యాక్సిడెంట్ అయింది అని చెబుతాడు. ఇక రుక్మిణి ఆ దారిలో వెతుక్కుంటూ వస్తుంది అన్నా ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అంట ఎక్కడ అని అటుగా వెళుతున్న వాళ్ళని అడుగుతుంది ఏమోనమ్మ తెలీదు అని అంటారు . అత్తమ్మకి యాక్సిడెంట్ జరిగిందని విన్నాను ఎక్కడ ఉంది అని అనుకుంటుంది. అంతలో రుక్మిణి అని దేవుడమ్మ పిలుస్తుంది ఇది అత్తమ్మ గొంతు లాగా ఉందే అని అనుకుంటుంది. పర్వాలేదు నీకు ఈ అత్తమ్మ గొంతు గుర్తుంది అంటూ ఆ చీకటిలో నుంచి దేవుడమ్మ బయటకు వస్తుంది.
ఒక్కసారిగా తన అత్తను చూడగానే రుక్మిణి స్టన్ అవుతుంది. ఇన్ని రోజులు నువ్వు బ్రతికే ఉండి నాకు ఆదిత్య కు దూరంగా ఉన్నావా.. నీది కానీ ఇంట్లో నువ్వు ఉంటున్నావా అంటూ దేవుడమ్మ అడుగుతుంది దేవుడమ్మ . తనతో పాటు తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది మళ్లీ రావడానికి కాదు నేను రాను అని రుక్మిణి చెబుతుంది. నేను ఆ ఇంటికి వచ్చేస్తే సత్య పరిస్థితి ఏమవుతుందో అని రుక్మిణి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు గర్భవతి విన్నాను నీకు పుట్టిన మా ఇంటి వారసత్వం ఎక్కడ నాకు ఎప్పటికీ చూపించవని దేవుడమ్మ అడుగుతుంది. తనని త్వరలోనే మీ ఇంటికి చేరుస్తాను అని దేవి పేరు మాత్రం చెప్పదు. రుక్మిణి రా మా అన్న ఇంటికి వెళ్దాం అని దేవుడమ్మ అంటున్న ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుక్మిణి..
సత్య ఆదిత్య రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఆదిత్య వాళ్ళ ఆఫీసు నుంచి ఒక అతను వస్తాడు. మేడం సార్ ఆఫీస్ లో తన బ్యాగ్ మర్చిపోయారు ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయేమోనని తీసుకువచ్చి ఇచ్చాను అని అతను చెబుతారు. బ్యాగ్ ఎందుకు మర్చిపోయాడు అని సత్యా బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. అందులో రుక్మిణి ఫోటో ఉండడం గమనిస్తుంది. విషయం ఇంతవరకు వచ్చింది అంటే నేను అసలు ఊరుకోకూడదు. నేను జాగ్రత్త పడాలి అని సత్య మనసులో అనుకుంటుంది.