Devatha: సత్య ఇంట్లో కనిపించకపోయేసరికి దేవుడమ్మ వాళ్ళు కంగారు పడతారు.. సత్య ఏ విషయమైనా సరే నాకు చెప్పి వెళ్తుంది.. అలాంటిది ఇప్పుడు నాకు ఒక్క విషయం కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.. సత్యలో ఏదో మార్పు వచ్చింది.. కానీ తను తన మనసులో దేని గురించో బాధపడుతుంది .. ఆ విషయం ఏంటో తెలియడం లేదు అని దేవుడమ్మ అంటుంది..
రుక్మిణి సత్య అన్న మాటలకు బాధపడుతూ ఇంటికి వెళ్లి భాగ్యమ్మను హత్తుకుంటుంది.. సత్య అవ్వ నన్ను తప్పుగా అనుకుంటుంది.. నా పెనిమిటి దగ్గరకు నేను మళ్ళీ వస్తున్నాను అని సత్య అనుకుంటుంది.. నా పెనిమిటి కి నేను కనిపించడం కూడా తప్పేనా.. నా పెనిమిటి ఈరోజు నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశానని అంటున్నాడు.. ఈ బాధలన్నింటికీ నేనే కారణమా అని రుక్మిణి భాగ్యమ్మ దగ్గర ఏడుస్తుంది.. ఇక పెనిమిటికీ బిడ్డని ఇచ్చే ప్రసక్తే లేదు.. దేవి నేను ఇద్దరం జీవితాంతం కలిసే ఉంటాము అని భాగ్యమ్మతో చెబుతుంది..
జానకమ్మ రాధను చూసి ఏదో విషయం చెప్పాలని అనుకుంటుంది.. అప్పుడే రాధ నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను .. కాకపోతే అది మీకు నయం అయిన తర్వాతే ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయినా ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని దీవించు అమ్మ అంటూ జానకమ్మ కాళ్ళ మీద పడుతుంది రాధ.. జానకమ్మ రాధను దీవించే క్రమంలో తన చేయి ముందుకు వస్తుంది.. అది చూసి రాధ ఏడుస్తుంది.. ఇదిగో మా అమ్మ అని భాగ్యమ్మ అని చూపిస్తూ తను నాకు లాగానే నీకు దగ్గర ఉండి సేవలు చేస్తుంది అని అంటుంది.. భాగ్యమ్మ జానకమ్మతో ఇన్నాళ్లు నా బిడ్డను మీ బిడ్డలాగా చూసుకున్నందుకు ఇలా మీకు సేవ చేయడం.. నేను భాగ్యంగా భావిస్తున్నాను అని భాగ్యమ్మ చెబుతుంది..
ఆదిత్య సత్య ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్లారు అంటే ఎవరు మాట్లాడరు .. ఇక ఇంట్లోకి వచ్చిన సత్య దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది . అప్పుడే దేవుడమ్మ వచ్చి రుక్మిణి తన జీవితాన్ని నీకు త్యాగం చేసింది.. తన త్యాగాన్ని వృధాగా ఫోనీవ్వద్దు.. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని నేను అడగను .. కానీ నీ మనసుకు పడటానికి కాసేపు దేవుడు గుడికి వెళ్లొద్దాం రా సత్య అని దేవుడమ్మ పిలుస్తుంది..
అప్పుడే చిన్నయి దేవి దేవి అని పిలుస్తుంది.. ఏమైందమ్మా చిన్మయి ఎవరిని పిలుస్తున్నావు అని రాధ అడుగుతుంది.. అమ్మ ఇంట్లో దేవి కనిపించడం లేదు అని చిన్మయి అంటుంది.. తను ఇంతకుముందు లాగా ఇంట్లో నుంచి మళ్లీ వెళ్లిపోయిందా అని చిన్మయి అడుగుతుంది. అప్పుడే రాధకి దేవి తన తండ్రి ఎవరో చెప్పమని అడిగినా ప్రశ్నలు గుర్తుకు వస్తాయి..