Entertainment News Telugu TV Serials

Devatha: రాధను వెల్లుపోమన్న జానకమ్మ.. ఆదిత్య ను అరిచిన దేవుడమ్మ..

Devatha Serial 22 September 2022 today episode Highlights
Share

Devatha: ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు అని సత్య అడుగుతుంది.. పనుంది బయటికి వెళుతున్నాను అని ఆదిత్య అంటాడు అప్పుడే దేవుడమ్మ వచ్చి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని సత్యా అడగాల్సిన పరిస్థితి వచ్చింది.. నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు నీతో పాటు సత్య ను తీసుకొని వెళ్ళు.. నీ పని అయిపోయిన తర్వాత తనతో కాసేపు సరదాగా గడపమని దేవుడమ్మ చెబుతుంది. ఇప్పుడు నాకు కుదరదమ్మ అని ఆదిత్య అంటాడు నీ పనులు అయిపోయిన తర్వాతే తీసుకెళ్లమని చెబుతున్నాను కదా అని దేవుడమ్మ అంటుంది.  నాకు కుదరదమ్మ అని విసుగ్గా చెప్పి అక్కడ నుంచి ఆదిత్య వెళ్ళిపోతాడు.. సత్య మనసులో ఆదిత్య పై రకరకాల ఆలోచనలు మొదలవుతాయి..

Devatha Serial 22 September 2022 today episode Highlights
Devatha Serial 22 September 2022 today episode Highlights

జానకమ్మ దూరంగా మాట్లాడుకుంటున్న ఆదిత్య రథలను చూసి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది.. అప్పుడే రాధ ఆదిత్య ను పెనిమిటి అని పిలుస్తుంది.. అంటే ఆదిత్య బాబు రాధ భర్త.. దేవమ్మ వాళ్ళ బిడ్డా.. అందుకేనా రాధ ఆ ఇంటికి ఆ మనుషులకు దూరంగా ఉంటుందా.. అన్ని తెలిసిన మాధవ్ తనతో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని జానకమ్మ మనసులో అనుకుంది..

Devatha: ఆదిత్య రాధ భర్తని తెలుసుకున్న జానకమ్మ.. రాధ అడుగుల్లో మాధవ్ అడుగులు..

మాధవ్ రాధ ఫోటో చూస్తూ గిటార్ వాయిస్తాడు.. రాధ ఇన్ని రోజులు నువ్వు నా మాట వినకుండా ఉన్నావు.. కానీ రేపటి నుంచి నీకు ఆ అవకాశం ఉండదు అని అంటున్న మాటలు చాటుగా జానకమ్మ వింటుంది.. జీవితాంతం నువ్వు నా నుంచి ఎక్కడికి వెళ్ళలేవూ రాధ.. వీడు ఏం చేయబోతున్నాడు అని జానకమ్మ ఆలోచిస్తుంది..

జానకమ్మ రాధ ను తన రూం లోకి తీసుకు వెళ్లి తన నగలను అన్నిటినీ మూటకట్టి ఇస్తుంది.. ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఉండద్దుమ్మ అని జానకమ్మ ఏడుస్తూ చెబుతుంది.. రాధ షాక్ అవుతు ఆమె ను చూస్తుంది.. రేపు ఉదయం దేవిని తీసుకుని వెళ్ళు.. ఎంది ఎండి మీరు చెప్పేది అని రాధ అడుగుతుంది.. నాకు అంతా తెలుసమ్మ ఆ ఆఫీసర్ నీ భర్త కదు అని జానకమ్మ అంది.. కళ్ళ ముందు భర్త ను పెట్టుకుని పరాయి స్త్రీ గా బ్రతకడానికి నీకు ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసమ్మ అని అంటుంది..


Share

Related posts

సత్యదేవ్-తమన్నాల‌ ప్రేమ‌క‌థ‌కు ఇన్ని అడ్డంకులు ఎందుకో..?

kavya N

NBK107 Teaser: `ఎన్‌బీకే 107` టీజ‌ర్‌.. మెంట‌లెక్కించేసిన బాల‌య్య‌!

kavya N

Rajamouli Udaykiran: రాజమౌళి సినిమాని మిస్ చేసుకున్న ఉదయ్ కిరణ్..??

sekhar