Devatha: ఆదిత్య రుక్మిణి ఇద్దరూ దేవి ని వెతుక్కుంటూ గుడికి వస్తారు.. గుడిలో దేవి అలా కింద పడుకొని ఉండడం చూసినా రుక్మిణి ఏడుస్తూ.. తనని ఒడిలోకి తీసుకొని ఏమైంది నా బిడ్డకు లేమ్మా దేవమ్మా అంటూ ఏడుస్తుంది.. రుక్మిణి, ఆదిత్య కూడా దేవి లేగువు అని అంటాడు..
అమ్మ నువ్వేనా ఈ పాపకి తల్లివి అని వైద్యం చేసే ఆయన అడుగుతాడు.. అవును అని చెబుతుంది రుక్మిణి.. నా బిడ్డకు ఏమైంది అని రుక్మిణి అడుగుతుంది.. పాప తిండి తిప్పలు లేక తిరుగుతుంది.. అది కాకుండా ఎండ దెబ్బ కొట్టి కింద పడిపోతే నా దగ్గరికి తీసుకువచ్చారు.. వైద్యం చేస్తున్నాను.. ప్రస్తుతం బానే ఉంది అని ఆయన చెబుతారు.. ఎందుకు దేవమ్మ ఇలా చేశావు నీకేమన్నా అయితే నేనేం కావాలి.. అంటూ రుక్మిణి ఏడుస్తుంది..
రాధ కంటే ముందే మాధవ్..
నీకంటే ముందే మీ ఆయన ఇక్కడికి వచ్చి బిడ్డను చూసి తల్లడిల్లి పోతున్నాడు ఆ మాటలు వినగానే ఆదిత్య రుక్మిణి ఇద్దరు షాక్ అవుతారు.. అవును రాధమ్మ నీకంటే ముందే మాధవ్ బాబు ఎక్కడికి వచ్చారు అని అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు చెబుతారు.. దేవి ఇలా ఉండడం చూసి మాధవ్ బాబు చాలా బాధపడ్డాడు.. బిడ్డకు నయం కావాలని గుళ్లో ఉన్న దేవుడు అందరికీ మొక్కుతూ తిరుగుతున్నాడు.. అలాంటి తండ్రికి ఈ బిడ్డ కూతురుగా పుట్టడం ఈమె అదృష్టం అని అంటాడు.. అంతలో అదిగో మాటల్లోనే వస్తున్నాడు అని మాధవ వైపు చూపిస్తారు..
మాధవ్ ఓవరాక్షన్..
స్వామి నా కూతురికి ఎలా ఉంది కళ్ళు తెరిచిందా అని అంటాడు.. రాధ వచ్చావా.. చూడు మన దేవి ఎలా ఉందో.. బిడ్డ కోసం నువ్వు అల్లాడిపోతూ ఉంటావని నీకోసం ఫోన్ చేశాను నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నువ్వేం కంగారు పడకు రాదా కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని అంటున్న మాధవ్ మాటలు వింటున్న రాధ చిరకుపడుతుంది..
నా బాధంతా రాధ కోసమే..
దేవికి బాగోకపోతే నేను అంతగా బాధపడింది రాధ కోసం.. దేవికి ఏమన్నా అయితే రాధా అసలు తట్టుకోలేదు అని మాధవ్ అంటాడు.. అందుకే స్వామి మా ఊరు ఊరంతా వీళ్ళిద్దరి గురించి చెప్పుకుంటుంది అని ఆ ఊరు అతను చెబుతాడు.. భార్యాభర్తలు అంటే రాధా మాధవ్ లాగా ఉండాలి అని అందరూ అనుకుంటారు.. ఊరికి ఆదర్శంగా నిలిచే మీ జంట ఊరికి ఒక్కటి ఉంటే చాలు అని ఆ స్వామీజీ చెప్తారు..
అందులో నా గొప్పదనం ఏమీ లేదు స్వామి అంతా మా రాధదే అని మాధవ్ అంటాడు.. తన ప్రేమతో నన్ను నా పిల్లల్ని ఇలా తయారు చేసింది అని మాధవ్ అంటాడు.. రాధా దేవికి ఏం ప్రమాదం లేదు నువ్వేం బాధపడకు అని మాధవ్ అంటాడు.. పక్కన నుంచుని వింటున్న ఆదిత్య కోపంగా ఉన్నా కానీ నా బిడ్డను క్షేమంగా కనిపించేలాగా చేసావు అది చాలు దేవుడా నాకు అని మనసులో అనుకుంటాడు..
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!