Devatha: రుక్మిణి ఆదిత్య ను కలిసి అసలు ఏమైంది పెనిమిటి.. ఆ అమ్మకి అంతా బాగవుతుంది అనుకుంటే.. ఇంతలో ఆ డాక్టర్ కి యాక్సిడెంట్ అయింది ఏంటి అని రుక్మిణి అడుగుతుంది నువ్వేం బాధపడకు రుక్మిణి.. ప్రకృతి వైద్యశాల గురించి నేను విన్నాను.. అక్కడికి జానకమ్మను తీసుకు వెళ్తే త్వరగా నయమవుతుంది.. ఆవిడ కంటే సీరియస్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు నయం చేశారు అని ఆదిత్య చెబుతాడు.. మరి ఇంకెందుకు పెనిమిటి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ అమ్మని ప్రకృతి వైద్యదేశాలకు తీసుకు వెళ్దామని రుక్మిణి అంటుంది.. సరే ముందు ఇంట్లో ఈ విషయం చెబుదాం పదా అని ఆదిత్య అంటాడు..
ఆదిత్య జానకమ్మను ప్రకృతి వైద్యశాలకు తీసుకు వెళ్దామని రామ్మూర్తితో చెబుతాడు. నువ్వు మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావంటే ఆ వైద్యశాల కచ్చితంగా మంచిదే అయి ఉంటుంది. కచ్చితంగా జానకిని అక్కడికి తీసుకెళ్దాం అని రామ్మూర్తి అంటాడు.. మాధవ్ ఆదిత్యను చూస్తూ మా అమ్మని నాకంటే ఎక్కువగా చూసుకుంటున్నావు.. ఎక్కువగా ఆలోచిస్తున్నావు.. అలాంటప్పుడు ఈ ప్రకృతి వైద్యశాలకు కూడా నువ్వు కూడా మాతో పాటు రమ్మని మాధవ్ అడుగుతాడు.. నువ్వు వస్తే బెటర్ అని మాధవ్ అంటాడు సరే అని ఆదిత్య అంటాడు..
మరోవైపు సత్య దేవుడమ్మ చెప్పినట్టుగా ఆదిత్య తోపాటు హరియనా వెళ్లడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. అందుకు కావలసిన లగేజ్ మొత్తం సర్దుతుంది ఆదిత్య ఇంటికి రాగానే త్వరగా ఫ్రెష్ ఆదిత్యా మనం బయటకు వెళ్లాలి అని సత్య చెబుతుంది.. ఎందుకు సత్య ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ ఏంటి అని ఆదిత్య అడుగుతాడు హర్యానా వెళ్తున్నాము అని సత్య చెబుతుంది.. అసలు నేను ఆఫీసర్ని అనుకుంటున్నారా.. లేదంటే ఆఫీసులో ప్యూన్ అనుకుంటున్నారా నాకు ఏం పనులు లేవు అనుకుంటున్నారా.. నేను అర్జెంటుగా క్యాంపు వెళ్ళాలి. నేను ఇప్పుడు ఎక్కడికి రాను అని ఆదిత్య తేల్చి చెబుతాడు అప్పుడే దేవుడమ్మ వచ్చి అలా అంటే ఎలాగా ప్రతిదానికి నువ్వు రానంటున్నావు అని అంటుంది.. కానీ ఆదిత్య సత్యతో టూర్ ని క్యాన్సిల్ చేసి రుక్మిణి తో పాటు ప్రకృతి వైద్యశాలకు వెళ్లాలని డిసైడ్ అవుతాడు..