NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: రాధని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని దండం పెట్టిన రాముర్తి..! మాధవ్ కి ఝలక్ ఇచ్చిన సత్య.!

satya fire on madhav

Devatha: రామ్మూర్తి రాధ దగ్గరకు వచ్చి అమ్మ రాధా నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. చెప్పండి ఏంటో అని రాధ అంది. ఈ విషయం నీకు సంబంధించినది.. నీ విషయాలలో నేను కల్పించుకోకూడదు అని నాకు తెలుసు. అలా అని నేను అడగకుండా కూడా ఉండలేను. ఇది కుటుంబ గౌరవానికి సంబంధించింది అందుకే అడగాలని అనుకుంటున్నాను. ఆఫీసర్ బాబు నువ్వు ఇద్దరూ మంచివాళ్ళు. మీ ఇద్దరు గురించి నాకు తెలుసు. ఆఫీసర్ బాబు దేవి కోసం మన ఇంటికి వస్తున్నాడని నాకు తెలుసు. అలాగే మన కుటుంబాలు కూడా కలిసి ఉన్నాయి. అలా అని మీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు అమ్మ.. మీ ఇద్దరు గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు..

rammurthy decission
rammurthy decission

నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేనమ్మ అని రామ్మూర్తి అంటాడు. ఆ బాబు దేవి కోసం వస్తున్నాడని నువ్వు అతనితో చనువుగా ఉండటం ఏం బాగోలేదు అమ్మ అని రామ్మూర్తి అంటాడు. నిన్ను  ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోలేనమ్మ. నీ గురించి తప్పుగా మాట్లాడటం అంటే.. ఈ ఇంటి గురించి తప్పుగా మాట్లాడినట్టే కదా అని రామ్మూర్తి అంటాడు. ఇక ఆ మాటలకు రాధ ఉండండి నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఈ విషయాన్ని నేను మీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఎలా చెప్పాలో అర్థం కాక ఊరుకున్నాను. ఇప్పుడు మీరే ఈ విషయం గురించి మాట్లాడారు కాబట్టి చెబుతున్నాను. ఆఫీసర్ సారు ఎవరో కాదు నా పెనిమిటి అని రాధ చెప్పేస్తుంది. ఏంటమ్మా రాధ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని రామ్మూర్తి అంటాడు. అవును ఆఫీసర్ సారు నా మెడలో తాళి కట్టిన నా పెనిమిటి అని రాధ అంటుంది.

rukmini speak about radha
rukmini speak about radha

అంతేకాదు నా పేరు రాధ కాదు రుక్మిణి అని కూడా చెబుతుంది. రుక్మిణి అనే పేరు వినగానే రామ్మూర్తి దేవుడమ్మ వాళ్ళింట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఆ పాపకు పెట్టిన పేరు కూడా ఇదే అని అనుకుంటాడు. కచ్చితంగా రుక్మిణి ఆ ఇంటి కోడలు అని అర్థం చేసుకుంటాడు. ఇంట్లో చెన్నై కోసం నేను వచ్చాను ఇప్పుడు ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమని చంపుకోలేక ఇక్కడ నుంచి వెళ్లలేకపోతున్నాను. అలా అని నేను వెళ్ళకుండా ఉండను. జానకమ్మకి పూర్తిగా నయమైపోయాక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని రుక్మిణి అంటుంది.

 

అప్పుడే చిన్మయి కూడా వచ్చి అవును తాతయ్య అమ్మ చెప్పేదంతా నిజం అని చెబుతుంది. నా కోసమే అమ్మ ఇంట్లో ఉంది అని చిన్మయి చెప్పింది. నీ పెనిమిటి కళ్ల ఎదురుగా కనిపిస్తున్న కూడా మా కోసం ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే.. నువ్వు నిజంగా దేవతవి అమ్మ అంటూ రుక్మిణిని చూస్తూ దండం పెడతాడు రామ్మూర్తి. ఆఫీసర్ బాబు భార్యవి తెలిసినాక నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండద్దమ్మా వెళ్ళిపో అని రామ్మూర్తి దండం అంటాడు..

devudamma reaction
devudamma reaction

దేవి దేవుడమ్మ వాళ్ళింట్లో తెగ సందడి చేస్తూ ఉంటుంది. దేవుడమ్మను రెట్టిస్తూ మాటలు మాట్లాడటం చూసిన సత్య ఎక్కువ దేవిని చూస్తుంటే కోపం వస్తూ ఉంటుంది. కానీ తను ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. దేవి వాళ్ళ నాన్న మంచివాడని ఆదిత్యను చూస్తూ చెబుతుంది. అప్పుడే దేవుడమ్మ నీకు మీ నాన్న కనిపించడం సమస్య అయితే నాకు నా కోడలు కనిపించడం సమస్య అని అంటుంది. అయితే మీ కోడలు ఫోటో ఒకటి నాకు చూపించవా నేను కూడా వెతుకుతాను అని దేవి అంటుంది. సరే అని దేవుడమ్మ అంది. ఆ మాటలకు ఆదిత్య సత్య ఇద్దరు షాక్ అవుతారు. వాళ్ళ అమ్మ రుక్మిణి ఫోటో చూస్తే దేనికి నిజం తెలిసిపోతుంది అని కంగారు పడతాడు.  దేవుడమ్మ బయటకు వెళ్తుంటే దేవి కూడా తనతో పాటు బయటకు వెళ్తానని మారాం చేస్తుంది. సరే అని దేవుడమ్మ తనతో పాటు తీసుకువెళ్తుంది.

 

సత్య మాధవ్ కు ఫోన్ చేస్తుంది. ఆదిత్య రుక్మిణి కలిసి ఉన్న ఫోటోలను పంపించాను కదా వాటిల్లో ఏదో అనుమానం వచ్చి ఫోన్ చేసినట్లు ఉంది అని మాధవ్ మనసులో అనుకుంటాడు. ఏంటి సత్య ఫోన్ చేశావు అని మాధవ్ అడుగుతాడు. దేవి ఏంటి నువ్వు తన తండ్రివి కావు అని చెబుతుంది. ఇదంతా నిజమేనా అని సత్య మాధవ్ ను అడిగేలోపు నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తరువాయి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu