Devatha: దేవుడమ్మ దేవిని తీసుకొని తన కారులో బయటకు వెళ్తుంది. ఇక అదే విషయాన్ని ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేసి చెబుతాడు. ఎప్పటికైనా ఈ విషయం అత్తమ్మకు తెలియాలి కదా అని రుక్మిణి ధైర్యంగా ఉంటుంది. తెలిస్తే తెలియని ఏం కాదులే అని ఆదిత్యకు రుక్మిణి చెబుతుంది. దేవిని నీ దగ్గరకు చేర్చాలని నేను అనుకుంటున్నాను. ఎప్పటికైనా అది చేసి తీరతాను అని రుక్మిణి అంటుంది. మరి నీ సంగతి ఏంటి అని ఆదిత్య అడుగుతాడు. తను ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేస్తుంది. దేవుడమ్మ తన కోడలు రుక్మిణి ఫోటోని దేవికి చూపిస్తుంది దేవుడమ్మ అవ్వ నీ కోడలు కనిపిస్తే నువ్వు ఏం చేస్తావు అని దేవి అడుగుతుంది.
అంతలో దేవి దేవుడమ్మ వాళ్ళ అమ్మను ఏం చేస్తుందని ఊహించుకుంటుంది. ఇదంతా నిజమే అవుతుందేమో అని అనుకుంటారు. రుక్మిణిని చూడగానే దేవుడమ్మ చంప పగలగొడుతుంది. నా ఇంట్లో రుక్మిణిగా పోయి రాధ గా ఇక్కడ బ్రతుకుతుంది. ఇన్నాళ్లు నా ఇంటి దేవతగా అనుకున్న నా రుక్మిణి ఇలా చాటుగా.. మరో పెళ్ళి చేసుకొని మమ్మల్ని మిమ్మల్ని మోసం చేసింది. ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు కనిపించకుండా మొఖం దాచుకొని తిరుగుతుంది. మా అమ్మ తప్పు చేయలేదు అని అంటుంది దేవి.
నా బిడ్డ చేత తాళి కట్టించుకుని మళ్ళీ మాధవ చేత తాళి కట్టించుకుంది అంటే ఇది మోసం కాదా అని దేవుడమ్మ అంటుంది. అత్తమ్మ నువ్వు ఇలా మాట్లాడకు.. నేను చెప్పేది విను అని రుక్మిణి అంటుంది.. నువ్వు ఆరోజు చనిపోయానని నమ్మించి వెళ్ళిపోయావు. నువ్వు ఆరోజు కాదు ఈరోజు నా దృష్టిలో చనిపోయావు. అవును నా కోడలు రుక్మిణి చచ్చిపోయింది అని అంటున్న దేవి ఏదో ఊహించుకుంటుంది. అదంతా దేవి భ్రమ. ఇదంతా నా ఊహ అని అనుకున్న దేవి దేవుడమ్మకు ముద్దు పెట్టి తన కారులో నుంచి దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఎలాగైనా అమ్మను నీ దగ్గరకు చేరుస్తాను కానీ ఇప్పుడే కాదు అని దేవి మనసులో అనుకుంటూ ముందుకు వెళుతుంది.