Devatha: అనుబంధాలకు నిలయం అనే ట్యాగ్ లైన్ తో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత.. ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.. ఈ సీరియల్ డిఫరెంట్ జోనర్ లో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.. ఈ సీరియల్ కాన్సెప్ట్ పాతదే అయినప్పటికీ కొత్త కోణంలో చూపిస్తూ ప్రేక్షకులు అలరిస్తుంది.. దేవత సీరియల్ లో ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ తో పాటు.. వచ్చే వారం ఏం జరగబోతోంది అనేది చూద్దాం..!!
రాధ ను శ్రీశైలం తీసుకెళ్లి అక్కడ ఎవ్వరికీ తెలియకుండా తనని పెళ్లి చేసుకోవాలని అనేది మాధవ్ ప్లాన్.. అది జానకమ్మ కు తెలుసుకుంటుంది మాధవ నువ్వు చేసేది తప్పు అని ఆమె ఎంత చెబుతున్నా వినదు. ఇక ఈ విషయం ఇంట్లో వాళ్లకి ఎవరికీ తెలియకుండా ఉండాలని.. ఆమెను మాధవ్ కావాలని మెట్ల మీద నుంచి కిందకు తోసి వేస్తాడు.. ఇక జానకమ్మ ను హాస్పిటల్ కి తీసుకువెళ్తే ఆమెకు పక్షవాతం అని అంటారు.. ఇక రాధ దగ్గరుండి జానకమ్మకు సేవలు చేస్తుంది.. జానకమ్మను ఎలాగైనా తిరిగి మామూలు మనిషిని చేయాలి అని రాధా ఆదిత్యను అడుగుతుంది.. తనకోసం స్పెషల్ లిస్టు డాక్టర్ ను ఆదిత్య తీసుకువస్తాడు.. ఆ డాక్టర్ జానకమ్మ రిపోర్ట్స్ అన్ని పరిశీలించిన తర్వాత వారం రోజుల్లో కోలుకుంటుంది అని కూడా చెబుతుంది.. కానీ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ డాక్టర్ కి యాక్సిడెంట్ అవుతుంది..
ఆ యాక్సిడెంట్స్ మాధవ్ చేపించాడని జానకమ్మకి బాగా తెలుసు. అందుకే కోపంతో తనమీద గ్లాస్ విసిరి కొడుతుంది.. అప్పుడు జానకమ్మ ముఖంలో ఏదో తెలియని భావం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది.. అది రాధ గమనిస్తుంది.. మరోవైపు డాక్టర్ కి యాక్సిడెంట్ చేయించింది నేనే అన్నట్టుగా మాధవ ముఖంలో ఏదో తెలియని సంతోషం కనిపిస్తుంది.. అది కూడా రాధా అబ్జర్వ్ చేస్తుంది.. వెంటనే ఇక ఈ విషయాన్ని ఆదిత్యతో చెప్పాలని రాధా ఆదిత్యను కలుస్తుంది. జానకమ్మ మెట్లు మీద నుంచి పడిపోవడానికి మాధవ ఈ కొట్ర చేశాడని.. తను పడిపోవడానికి కారణం మాధవి అని రాధకు చెబుతుంది జానకమ్మ.. వచ్చేవారం ఇదే హైలెట్ సీన్ కానుంది.. ఇక ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..