21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్.. ఈ సీన్ తో మళ్లీ ప్లేస్ లోకి సీరియల్

Devatha Serial 7 September 2022 today episode Highlights
Share

Devatha: అనుబంధాలకు నిలయం అనే చక్కని ట్యాగ్ లైన్ తో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ దేవత.. ఈ సీరియల్ సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆలస్తోంది.. నిన్నటితో ఈ సీరియల్ 652 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ రేటింగ్స్ లో దేవత సీరియల్ 10 రేటింగ్ను సొంతం చేసుకుని నాలుగో స్థానంలో నిలిచింది.. గత కొన్ని వారాలుగా దేవత సీరియల్ ఇదే ప్లేస్ లో నిలుస్తూ వచ్చింది. ఈవారం కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది..! ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో తెలుసుకుందాం..!

Devatha Serial TRP rating and next week episode highlights
Devatha Serial TRP rating and next week episode highlights

రుక్మిణి ఆదిత్యను పెళ్లి చేసుకుంటుంది.. కానీ ఆదిత్య అంతకుముందే తన చెల్లెలు సత్య ను ప్రేమించాడని తెలుసుకుంటుంది.. తన వల్ల ఆమె చెల్లి సత్య కూడా గర్భవతి అయిందని తెలుసుకుంటుంది.. వీళ్ళిద్దరినీ కలపాలని చనిపోయినట్టుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.. తన చెల్లి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది కానీ రుక్మిణి… తను చనిపోకుండా బ్రతికే ఉంటుంది.. అలా తన జీవితాన్ని రాధ అనే పేరుతో మళ్లీ కొత్తగా మొదలు పెడుతుంది..

 

Devatha Serial: దేవత సీరియల్ లో వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఇదేనా.!?

మాధవ్ అనే అతనికి భార్య కాని భార్యగా రాధగా అతని జీవితం లో అడుగుపెడుతుంది.. రాధ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే తను గర్భవతి కావడంతో తనకు దేవి అనే కూతురు ఉంటుంది. మాధవ్ కి చిన్మయి అనే కూతురు ఉంటుంది.. వీళ్లిద్దరి అమ్మగా రాధ పెంచుకుంటుంది.. కొన్ని రోజుల తర్వాత ఆదిత్య ఆఫీసర్ అయ్యి రాధ ఉంటున్న ఊరికే రావడం.. తనని తన కూతుర్ని గుర్తుపట్టడం .. ఎలాగైనా తన ఇంటికి రాధను దేవిని తీసుకువెళ్లాలని తనతో పాటు తన ఇంటికి తీసుకు వెళ్లాలని అనుకుంటాడు.. రాధ రాను అనడంతో దేవీ నైన తనతో బతుకు తన బిడ్డగా ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేయాలని అనుకుంటాడు.. సత్య కు కూడా పిల్లలు పుట్టకపోవడంతో దేవి పై అందరూ ప్రేమను పెంచుకుంటారు.. మాధవ్ తన భార్యగా ఉన్న రాధను ఈ ఇంటి గడప దాటడానికి వీల్లేదని తను జీవితాంతం తనతో పాటే తన భార్యగా ఆ ఇంట్లోనే ఉండాలని అనుకుంటాడు.. అందుకోసం రాధను దేవిని అనుక్షణం మానసిక చిత్రాల చేస్తూనే ఉంటాడు.. చిన్మయి కి ఆదిత్య రుక్మిణి పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలుస్తుంది..ఈ విషయం చిన్మయి వాళ్ళ అమ్మను అడిగి నివృత్తి చేసుకుంటుందా.. లేదంటే దేవుడమ్మను అడిగి తెలుసుకుంటుందా అనేదే వచ్చేవారం హైలైట్ సీన్.. అంతేకాకుండా మాధవ్ నిజస్వరూపం తెలుసుకున్న రాధ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది..


Share

Related posts

కాజ‌ల్ ఈజ్ బ్యాక్‌.. గుర్రపు స్వారీతో అద‌ర‌గొట్టిన చంద‌మామ‌!

kavya N

పొలిటికల్ సెటారికల్ జోనర్ లో మాస్ రాజా రవితేజ..??

sekhar

Sriram: బీహార్ లో బన్నీ క్రేజీ గురించి చెప్పిన హీరో శ్రీరామ్..!!

sekhar