Devatha: అనుబంధాలకు నిలయం అనే చక్కని ట్యాగ్ లైన్ తో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ దేవత. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అలరిస్తుంది. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ లో దేవత సీరియల్ 8.49 రేటింగు సొంతం చేసుకుని నాలుగో స్థానంలో నిలిచింది. గత కొన్ని వారాలుగా దేవతా సీరియల్ నాలుగో స్థానంలోనే కొనసాగుతూ ఈ వారం కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కాకపోతే ఈ వారం టిఆర్పి రేటింగ్ మాత్రం కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. ఈ ట్విస్ట్ తో వచ్చేవారం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ పెరుగుతుందో లేదో చూడాలి.
ఈ సీరియల్ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. చెల్లి అక్క కోసం తన ప్రేమను త్యాగం చేస్తే.. అక్క తన భర్తను తన చెల్లి కోసం త్యాగం చేస్తుంది. అలా ఆ అక్క ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆమె కులీ నాలి పనులు చేసుకుంటూ తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆమె బ్రతుకుతుంది. ఒకరోజు రోడ్ యాక్సిడెంట్ అయిన ఒకరికి కాపాడే ప్రయత్నం లో ఆ పిల్లకి తల్లిగా ఆ ఇంటికి వెళ్తుంది. ఆ భర్త కానీ భర్తకు భార్యగా ఉంటు.. తన కూతురు తో పాటు ఆ పాపను కూడా తన సొంత బిడ్డలా పెంచుకుంటుంది.
అయితే ఆ కూతురికి రాధా నిజం చెప్పేస్తుంది . నిజం తెలుసుకున్న చిన్మయి రాదను తన అత్తింటి వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తుంది. ఇక దేవి కూడా తన తండ్రి ఎవరు అని తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఒక సోది అమ్మాయి చేత తన తల్లి దగ్గరకు పంపించి తన తండ్రికి ప్రాణగండం ఉందని చెప్పమని చెబుతుంది. వేణుగోపాల స్వామి గుడిలో పూజ చేస్తే మళ్లీ వాళ్ళిద్దరికీ ఎటువంటి కష్టాలు ఉండవని దేవి చేపిస్తుంది. ఇక అది దేవి ప్లాన్ అని తెలియక ఆదిత్య రుక్మిణి ఇద్దరూ కలిసి గుడిలో దీపాలు పెట్టడం దేవి చూస్తుంది. అప్పుడే ఆఫీసర్ సరే మా నాన్న అని దేవి తెలుసుకుంటుంది. ఆ రోజు నుంచి తనలో కొత్త మార్పు మొదలవుతుంది..
అటువంటి సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది ఈ సీరియల్. అయితే ఈ వారం ఈ కథను ఎటువైపు మలుపు తిప్పుతారా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సత్యం మాత్రం ఆదిత్య పై కోపంగా ఉంటుంది. అంటే దేవి ఆదిత్య కూతురా అని సత్య తెలుసుకుంటుంది. లేదు అంటే దేవుడమ్మ దేవినే తన సొంత మనవరాలు అని తెలుసుకుంటుంది. మరోపక్క రామ్మూర్తికి ఆఫీసర్ భార్య తన ఇంట్లో ఉంటున్న రాధా అని తెలిసిపోవచ్చు.