డిసెంబర్ 2.. నటసింహం నందమూరి బాలకృష్ణకు లక్కీ తేదీ అని చెప్పొచ్చు. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న బాలయ్య.. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన `అఖండ` చిత్రంతోనే హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు.
ఈ సినిమాను సైతం తనకు కలిసొచ్చిన డిసెంబర్ 2న విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు ఆ తేదీ పైనే హీరోలందరూ పడుతున్నారు. ఇప్పటికే అడివి శేష్ హీరోగా తెరకెక్కిన `హిట్ 2` చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా మరో హీరో సైతం అదే తేదీపై కన్నేశారు. ఆ హీరో మరెవరో కాదు ధనుష్. ఈయన ప్రస్తుతం తెలుగులో డైరెక్ట్ గా `సార్` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. విద్యా వ్యవస్థలోని లోపాల చుట్టూ ఈ మూవీ కథ నడుస్తుంది. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇందులో ధనుష్ బాలగంగాధర్ తిలక్ అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ తాజాగా అధికారిక పోస్టర్ ను సైతం బయటకు వదిలారు. డిసెంబర్ 2న పోటీ పడుతున్న ధనుష్, అడివి శేష్లు హిట్ కొడతారా..లేదా.. అన్నది చూడాలి.
https://twitter.com/SitharaEnts/status/1571735100370616320?s=20&t=xaIsKZQczLK8iWQoLtxcrw