25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
Entertainment News సినిమా

ఆస‌క్తి రేకెత్తిస్తున్న `సార్` టీజ‌ర్‌.. లెక్చ‌ర‌ర్‌గా అద‌ర‌గొట్టిన ధ‌నుష్‌!

Share

కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ ఉత్తమ నటుడు ధ‌నుష్ తెలుగులో డైరెక్ట్‌గా చేస్తున్న తొలి చిత్రం `సార్‌`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌందర్య నిర్మిస్తున్నారు.

జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. తెలుగులో `సార్` టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రం తమిళంలో `వాతి` అనే టైటిల్‌తో విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం నుండి తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈరోజు ధనుష్ పుట్టినరోజు కావడంతో.. ఆయ‌న ఫ్యాన్స్‌కు టీజ‌ర్ రూపంలో ట్రీట్ ఇచ్చారు.

`జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్ అంటూ మోర్ ఫీజు.. మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్` అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్‌.. ఆధ్యంతం ఆక‌ట్టుకుంటూ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించింది. బాల గంగాధర్ తిలక్ అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో ధ‌నుష్ అద‌ర‌గొట్టాడు. ఆయ‌న లుక్స్ న్యాచుర‌ల్‌గా, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.

ముఖ్యంగా `విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేధ్యంతో సమానం సార్. పంచండి. ఫైవ్ స్టార్ హోటల్లో డిష్‌లాగా అమ్మకండి..` అంటూ ధనుష్ చెప్పే డైలాగ్స్ టీజ‌ర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఫైట్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువ‌ల్స్ వంటి అంశాలు కూడా బాగున్నాయి. మొత్తానికి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌బోతోంద‌ని టీజ‌ర్ బ‌ట్టీ అర్థ‌మ‌వుతోంది. మ‌రి తొలి స్ట్రెయిట్ మూవీతో ధ‌నుష్ ఇక్క‌డ స‌క్సెస్ అవుతాడా..లేదా..అన్న‌ది చూడాలి.


Share

Related posts

Chiranjeevi: చిన్న నాటి టైంలో చరణ్ గదిలో రానా చేసిన చిలిపి పని బయటపెట్టిన చిరంజీవి..!!

sekhar

Bheemla Naayak: చంద్రబాబు ట్రాప్ లో పడోద్దు నాగబాబు, పవన్ పై కొడాలి కీలక వ్యాఖ్యలు..!!

sekhar

బిగ్ బాస్ 4: కెప్టెన్ అయినా ‘సోహెల్’.. కథ ఎలా ఉంటాదో చూడాలి మరి!

Teja