`రాజా ది గ్రేట్` తర్వాత చాలా కాలం ఫ్లాపులతో సతమతం అయిన మాస్ మహారాజ్ రవితేజ.. 2021లో వచ్చిన `క్రాక్`తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఇదే జోరును ఆయన కంటిన్యూ చేయలేకపోతున్నాడు. వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.. కానీ, ఈయన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతోంది.
రీసెంట్‌గా ఈయన నుండి వచ్చిన చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భారీ అంచనాల నడుమ జూలై 29న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.
ఇప్పటికే `పడిపడిలేచే మనసు`, `ఆడవాళ్లు మీకు జోహార్లు`, `విరాట పర్వం` సినిమాలను నిర్మించి ఆర్థికంగా బాగా నష్టపోయిన నిర్మాత సుధాకర్ చేరుకూరికి `రామారావు ఆన్ డ్యూటీ`తో మరో దెబ్బ పడింది. ఈ నేపథ్యంలోనే రవితేజ ఆ నిర్మాత ఆర్దికంగా కోలుకునేందుకు తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేయాలని నిశ్చయించుకున్నారట.
అలాగే రెమ్యునరేషన్ విషయంలో పట్టింపు లేకుండా నెక్స్ట్ మూవీ చేసి పెడతాననీ, బడ్జెట్ తక్కువలో చేయడానికైనా తాను సిద్ధమే అని సదరు నిర్మాతకు రవితేజ చెప్పారట. అంతేకాదు, ఫైనాన్సియల్ గా కూడా హెల్ప్ చేస్తానని మాట ఇచ్చినట్లు నెట్టింట ఓ టాక్ బలంగా వినిపిస్తోంది. మరి నిజంగా రవితేజ అంత గొప్ప పని చేస్తే.. ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేరు.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…