సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి గురించి పరిచయాలు అవసరం లేదు. `స్వయంవరం` వంటి హిట్ మూవీతో గ్రాండ్ గా సినీ కెరీర్‌ను ప్రారంభించిన వేణు.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దశాబ్దం పాటు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగిన ఈయన 2013లో విడుదలైన `రామాచారి` తర్వాత తెరపై కనిపించలేదు.
అయితే మళ్లీ ఇన్నేళ్లకు మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపుదిద్దుకున్న `రామారావు ఆన్ డ్యూటీ`తో వేణు రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఇకపోతే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వేణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఆ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలెన్నో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు జగపతిబాబును నమ్మి డబ్బును కూడా పోగొట్టుకున్నట్లు వెల్లడించారు. వేణు మాట్లాడుతూ.. `జగపతిబాబు గారితో మంచి రిలేషన్ ఉండేది. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనతో కలిసి కొన్ని సినిమాలు చేశాను. అయితే మా ఇద్దరి మధ్య ఓ సంఘటన జరిగింది. దాని కారణంగా నేను ఆర్థికంగా నష్టపోయాను.
ఒక వ్యక్తికి నా చేత డబ్బిలిప్పించారు. నాది హామీ అని జగపతిబాబు గ్యారెంటీ ఇవ్వడంతోనే నేను డబ్బులిచ్చా. కానీ ఆ వ్యక్తి డబ్బు తిరిగివ్వలేదు. డబ్బు వెనక్కిచ్చారా లేదా..? అని జగపతిబాబు కూడా అడగలేదు. నాకు చాలా బాధ కలిగింది. మొత్తం రూ.14 లక్షలు. ఆరోజుల్లో అది నాకు చాలా పెద్ద అమౌంట్.`అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…