నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `బింబిసార`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వారినా హుసేన్ హీరోయిన్లుగా నటించారు.
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న టైమ్ ట్రావెల్ మూవీ ఇది. ఇందులో మగధ రాజ్యాధిపతి బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ అలరించబోతున్నారు. కొద్ది నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సోసియో ఫాంటసీ చిత్రం.. ఆగస్టు 5న అట్టహసంగా విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అయితే ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ధరించిన టీ షర్ట్ ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.
`బింబిసార` ఈవెంట్లో ఎన్టీఆర్ వేసుకున్న బ్లాకర్ కలర్ టీ షర్ట్ కార్ల్ లాగర్ ఫిల్డ్ కంపెనీ బ్రాండ్‌కు చెందినది. దాని ఖరీదు రూ. 24 వేలు. దీంతో ఎన్టీఆర్ ధరించిన ఆ టీ షర్ట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సెలబ్రెటీలకు ఇలాంటి ఖరీదైన దుస్తులను ధరించడం కొత్తేమి కాదు. అయినప్పటికీ ఒక టీ షర్ట్‌కు ఎన్టీఆర్ అంత ఖరీదు పెట్టడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ స్థాయికి రూ. 24 వేల టీ షర్ట్ చాలా తక్కువని అంటున్న వారు ఉన్నాయి.