టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కోలీవుడ్ డైరెక్టర్ ఎన్.లింగుసామి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ది వారియర్`. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తే.. ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అలరించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమిళంలో 28 మంది సెలబ్రిటీలను ఆహ్వానించి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల ఘనంగా నిర్వహించారు.
ఇటు తెలుగులో జూన్ 10న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్ లో `ది వారియర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఇకపోతే ఈ మూవీ తెలుగు, తమిళ్ వర్షన్ల మధ్య కొన్ని తేడాలు ఉంటాయట. సాధారణంగా తమిళ ప్రేక్షకులు ఊర మాస్ కి బాగా ఎట్రాక్ట్ అవుతారు. అందుకే `ది వారియర్`లో ఆది పినిశెట్టి విలనిజం వేరె లెవల్లో చూపబోతున్నారట.
ఆది పినిశెట్టి విలనిజానికి సంబంధించిన కొన్ని సీన్స్ తమిళంలో ఉంటాయట. కానీ తెలుగు వర్షన్ లో మాత్రం ఉండవని అంటున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగానే ఆయా సీన్స్‌ను కట్ చేశారట. ఇలా తెలుగు, తమిళ్ వర్షన్ల మధ్య చిన్న చిన్న తేడాలు ఉంటాయని తెలుస్తోంది.