త‌న‌యుడికి నామకరణం చేసిన దిల్‌రాజు.. ఆ పేరు వెన‌క క‌థ అదేనా?

Share

శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత‌, స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2020లో ఈయ‌న వైఘా రెడ్డి (తేజస్వి)ని రెండో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. 49 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ప్రారంభించిన దిల్ రాజు.. ఇటీవ‌లె మ‌ళ్లీ తండ్రి అయ్యాడు.

ఆయ‌న భార్య తేజ‌స్వి జూన్ 29న పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. వార‌సుడు పుట్ట‌డంతో.. తెలుగు చిత్రసీమకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు దిల్ రాజు దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక‌పోతే తాజాగా త‌న‌యుడికి దిల్ రాజు నాయ‌క‌ర‌ణం చేశారు. ఇంత‌కీ ఆయ‌న కుమారుడి పేరేంటో తెలుసా.. `అన్వయ్ రెడ్డి`.

మగబిడ్డకు జన్మనిచ్చిన దిల్‌రాజు సతీమణి తేజ‌స్విని..!

అయితే ఈ పేరును పరిశీలించే క్రమంలో దిల్​రాజు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అస‌లీ పేరు వెన‌క క‌థ ఏంటంటే.. దిల్ రాజు త‌న ఇద్ద‌రు భార్య‌ల పేర్లు క‌లిసేలా త‌న‌యుడికి పేరు పెట్టార‌ట‌. ఆయ‌న మొదటి భార్య పేరు అనిత. రెండో భార్య పేరు తేజస్వి కాగా.. పెళ్లికి ముందు వైఘా రెడ్డి అని మార్చారు.

ఈ క్ర‌మంలోనే ఇద్దరు పేర్లలో అక్షరాలు కలిసి వచ్చేలా `అన్వయ్` గా కుమారుడికి నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతేకాదు, త్వ‌ర‌లోనే కుమారుడి పేరును అఫీషియ‌ల్‌గా దిల్ రాజు అనౌన్స్ చేస్తార‌ట‌. కాగా, దిల్ రాజు మొద‌ట‌ భార్య అనిత.. అనారోగ్యంతో 2017లో మరణించింది. వీరికి హ‌న్షిత‌ అనే కుమార్తె ఉంది. ఆమె ప్ర‌స్తుతం నిర్మాత‌గా రాణిస్తోంది.

 


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

17 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago