Anudeep: “జాతి రత్నాలు” ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ అందరికీ సుపరిచితుడే. కామెడీ కథలను అద్భుతంగా తెరకెక్కించి ఈతరం వాళ్లు ఆహ్లాదంగా నవ్వుకునే విధంగా.. కుటుంబ సమేతంగా చూసే సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కుర్రదర్శకులలో మంచి కామెడీ హ్యూమర్ కలిగిన డైరెక్టర్ గా అనుదీప్ కి మంచి పేరుంది. పెట్ట గోడ అనే సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన అనుదీప్ “జాతిరత్నాల”తో అందరి దృష్టి ఆకర్షించాడు. కేవలం డైరెక్షన్ లో మాత్రమే కాదు బయట వేదికలపై కూడా అనుదీప్ చేసే కామెడీ చాలా హైలెట్. చాలా సేటరికల్ గా మాట్లాడుతూ ఉంటాడు.
ఈ తరహాలోనే “గాడ్ ఫాదర్” సినిమాపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే అనుదీప్ దర్శకత్వంలో “ప్రిన్స్” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ హీరోగా ఉక్రెయిన్ దేశానికి చెందిన నటి మరియా అనే అమ్మాయి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అనుదీప్ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో “గాడ్ ఫాదర్” సినిమా గురించి ప్రస్తావించారు.
అందరూ “గాడ్ ఫాదర్” చూడలేదని అంటే… చాలా వింతగా చూశారు. కానీ చాలా ఆలస్యంగా సినిమా చూశాను. సినిమా పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేదని అనిపించింది. చాలా బోర్ కొట్టిందని… అనుదీప్ చెప్పడంతో వెంటనే యాంకర్ ఎవరు ఈ మాట చెప్పలేదు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారని తిరిగి ప్రశ్నించారు. వెంటనే తాను హాలీవుడ్ “గాడ్ ఫాదర్” సినిమా గురించి మాట్లాడుతున్నట్లు అనుదీప్ తెలియజేయడం జరిగింది. దీంతో కావాలనే యాంకర్ ని ఏడిపించడానికి.. మన జాతిరత్నం ఈరకంగా ఎటకారం చేశారని … ఈ వార్తపై నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.