Dasara: న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `దసరా`. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సముద్ర ఖని, జరీనా వాహెబ్, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం తొలిసారిగా నాని తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. అలాగే మున్నెప్పుడూ కనిపించని రఫ్ లుక్‌లో ఆయన కనిపించబోతున్నారు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కొంత షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది.
అయితే నాని నటించిన మరో చిత్రం `అంటే సుందరానికీ` రిలీజ్ సందర్భంగా.. నాని `దసరా` షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. కానీ, ఈలోపే `దసరా` మూవీతో ఆగిపోయిందంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. గత రెండు రోజుల నుంచీ ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవతోంది.
అయితే ఈ విషయంపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దసరా షూటింగ్ ఆగిపోయిందని ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన ఆయిన.. సినిమా ఆగలేదని తెలుపుతూ బ్రహ్మానందం మీమ్‌తో కౌంటర్ ఇచ్చారు. అనవసరమైన పుకార్లను నమ్మవద్దని శ్రీకాంత్ ఓదెల చెప్పకనే చెప్పేశారు. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తేలిపోయింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…