Ante Sundaraniki: `మెంటల్ మదిలో`, `బ్రోచేవారెవరురా` వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నుంచి వచ్చిన మూడో సినిమానే `అంటే.. సుందరానికీ!`. న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై ఈ మూవీ నిర్మించారు.
నరేష్, రోహిణి, నదియా, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు. జూన్ 10న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. మంచి స్పందనను దక్కించుకుంది. కానీ, సినిమా నడివి విషయంలో నెగటివ్ కామెంట్స్ వ్యక్తం అయ్యాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముఖ్యంగా ఫస్టాఫ్ మరీ సాగదీతగా ఉందంటూ చాలా మంది పెదవి విరిచారు. అయితే ఈ విషయంపై డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. తాజాగా చిత్ర టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌తో వివేక్ మాట్లాడుతూ.. `ఈ సినిమా ఫస్టాఫ్ చాలా స్లోగా ఉందని అంటున్నారు. హీరో హీరోయిన్స్ చిన్నప్పటి నుంచి చెబుతూ రావడం వల్ల అలా అనిపించి ఉంటుంది.
సెకండాఫ్ ను స్పీడ్ గా తీసిన నాకు ఫస్టాఫ్ స్పీడ్ గా ఉండాలని తెలియదా? సెకండాఫ్ మీకు కనెక్ట్ కావాలంటే ఫస్టాఫ్ అలా ఉండాల్సిందే. దాన్ని అలా చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఓ పది పదిహేను రోజులు థియేటర్లో ఉండిపోయే కాదు. ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ ఉండిపోయే సినిమా. ఎప్పుడు చూసినా ఈ సినిమా నచ్చుతూనే ఉంటుంది .. నవ్విస్తూనే ఉంటుంది` అంటూ చెప్పుకొచ్చారు. దాంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!