Mahabharat Series: HBO నుండి గేమ్ అఫ్ థ్రోన్స్, హౌస్ అఫ్ డ్రాగన్స్ లాంటి షోస్, ఇంకా మర్వెల్ సినిమాలు/సిరీస్, భారత OTT పరిశ్రమలో డిస్నీ+హాట్స్టార్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకోవాలి. ఇలాంటి భారీ బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న డిస్నీ+హాట్స్టార్ జాబితాలోకి త్వరలో మహాభారత్ సిరీస్ చేరనుంది.
అల్లు ఎంటర్టైన్మెంట్స్ ఇంకా మిథోస్ స్టూడియోస్ నిర్మాణం లో భారీ సిరీస్: డిస్నీ+హాట్స్టార్ ట్వీట్
తాజా గా డిస్నీ + హాట్ స్టార్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ఒకటి అందరిని ఆనందంలో మునిగేట్టు చేసింది. ఇటీవలే అల్లు అరవింద్ నేత్రుత్వంలో అల్లు ఫామిలీ అల్లు ఎంటర్టైన్మెంట్స్ ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందె. ఇప్పుడు ఈ అల్లు ఎంటర్టైన్మెంట్స్ ఇంకా మిథోస్ ఓవర్సీస్ స్టూడియోస్ కలిసి డిస్నీ+ హాట్ స్టార్ లో OTT రిలీజ్ కోసం మహాభారత్ ని సిరీస్ రూపంలో నిర్మిస్తున్నట్టు ఈ తాజా ట్వీట్ ధ్వారా డిస్నీ+ హాట్ స్టార్ ప్రకటించింది.
డిస్నీ+హాట్స్టార్ OTT లో మహాభారత్ సీరియల్ కి ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం చేయబోతున్నాడా ?
ఇటీవల మీడియా తో మాట్లాడుతూ మహాభారతం మీద తనకున్న ఇష్టాన్ని ఎస్. ఎస్. రాజమౌళి వ్యక్తం చేసాడు. భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్నిచిత్రీకరించే కథలంటే ఎస్. ఎస్. రాజమౌళి కి చాలా మక్కువ, ఎప్పటికైనా మహాభారతం చిత్రీకరించటం తన కోరిక అని ఎస్. ఎస్. రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. కట్ చేస్తే, ఈ మాటలు మీడియాతో మాట్లాడిన 2 నెలలలోపే డిస్నీ+ హాట్ స్టార్ ఈ ప్రకటన ఇవ్వడం ఆసక్తికరం.
ఇక్కడ పాఠకులు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ట్వీట్ లో ఎక్కడ కూడా డిస్నీ+హాట్స్టార్ ఎస్. ఎస్. రాజమౌళి పేరుని వాడలేదు. కానీ అందరి అంచనాలు మాత్రం అల్లు ఎంటర్టైన్మెంట్స్ తో మహాభారత్ సీరియల్ కి పనిచేయబోయేది ఎస్. ఎస్. రాజమౌళి.
The greatest epic ever written- retold at a scale never seen before! Stay tuned for an ethereal spectacle- #Mahabharat, is coming soon.#HotstarSpecials #Mahabharat #MahabharatOnHotstar @alluents
& @MythoStudios pic.twitter.com/P8cBRWOcLB— Disney+ Hotstar (@DisneyPlusHS) September 11, 2022