Entertainment News సినిమా

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

Share

ప్ర‌భాస్‌: గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం కోసం ఆగ‌స్టు 1వ తేదీ నుండి సమ్మె బాట సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచీ తెలుగు సినిమాల షూటింగ్స్‌ నిలిచిపోయాయి.

ఈ కార‌ణంగా చాలా మంది హీరోలు ఇంటికి ప‌రిమితం అయ్యారు. అయితే ఈ స‌మ్మె ఎఫెక్ట్ ప్ర‌భాస్‌ మ‌రియు అత‌డి సినిమాల‌పై భారీగా ప‌డింద‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌న `సలార్‌`, `ప్రాజెక్ట్ కె` చిత్రాలు చేస్తున్నాడు. ఇందులో `స‌లార్` ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తుంటే.. `ప్రాజెక్ట్ కె` నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోంది.

ఈ రెండూ పాన్ ఇండియా చిత్ర‌లే. పైగా హై బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు హైద‌రాబాద్‌లో షూటింగ్స్‌ను జరుపుకుంటున్నాయి. అయితే స‌మ్మె కార‌ణంగా `స‌లార్‌`, `ప్రాజెక్ట్ కె` తాజా షెడ్యూల్ నిలిచిపోయాయ‌ట‌. త‌ద్వారా ఆయా సినిమాల‌కు రూ. 20 నుండి రూ. 25 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ట‌.

అలాగే ఈ సినిమాల‌కు ప్రభాస్ ఇచ్చిన డేట్లు వేస్ట్ అవుతున్న‌ కారణంగా ఆయనకు కూడా రూ. 5 కోట్ల‌కుపైగా నష్టం తప్పదు అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. మ‌రి ఈ టాక్ ఎంత వ‌ర‌కు నిజ‌మో ఆయ‌న‌కే తెలియాలి. కాగా, ప్ర‌భాస్ ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే ఈయ‌న ఓం రౌత్ డైరెక్ష‌న్‌లో `ఆదిపురుష్‌`ను కంప్లీట్ చేశాడు. మ‌రోవైపు సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` అనే మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు.


Share

Related posts

బైక్‌ చుట్టూ బన్ని

Siva Prasad

వైరల్ ఫోటో : చాలా రోజుల తర్వాత కనిపించిన నందమూరి మోక్షజ్ఞ

arun kanna

MCA Remake: నాని మూవీతో బాలీవుడ్‌కు మ‌రో పెద్ద దెబ్బ ప‌డిందిగా!

kavya N