`రామారావు ఆన్ డ్యూటీ` కథ చెబుతానంటే వ‌ద్దు పొమ్మ‌న్న హీరో ఎవ‌రో తెలుసా?

Share

`క్రాక్‌`తో చాలా కాలం త‌ర్వాత స‌క్సెస్ ట్రాక్ ఎక్కి.. `ఖిలాడి`తో మ‌ళ్లీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డిన మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌.. ఇప్పుడు `రామారావు ఆన్ డ్యూటీ`తో ఎలాగైనా హిట్ అందుకోవాల‌ని చూస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంతో శరత్ మండవ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

రాజీషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వాయిదా ప‌డుతూ ప‌డుతూ చివ‌రాఖ‌ర‌కు జూలై 29న విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. దీంతో మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. `రామారావు ఆన్ డ్యూటీ` కథ చెబుతానంటే ఓ హీరో వ‌ద్దు పొమ్మ‌న్నాడ‌ట‌. ఇంత‌కీ ఆయ‌నెవ‌రో కాదు.. సీనియ‌ర్ హీరో వేణు తొట్టెంపూడి. చాలా కాలం నుండీ సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న `రామారావు ఆన్ డ్యూటీ`తో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అయితే ఆయ‌న్ను ఈ సినిమాకు ఎలా ఒప్పించానో తాజా ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండవ వివ‌రించాడు. శరత్ మాట్లాడుతూ ..“వేణు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రకి ఆయన బాగా సూట్ అవుతార‌ని అనిపించింది.

కాకపోతే ఆయన సినిమాలు మానేసి చాలా కాలమైంది. అయినా స‌రే కథ చెప్పడానికి వెళ్లాను. `చేసే ఉద్దేశం లేనప్పుడు వినడం ఎందుకండీ .. వద్దండి` అని ఆయ‌న అనేశారు. ఒకసారి కథ వినండి సార్ .. ఆ తరువాత మీ అభిప్రాయం చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేశాను.. అప్పుడు ఆయన కథ విన్నారు. కథ మొత్తం విన్న తరువాత చేస్తానని చెప్పారు. అలా మొత్తానికి ఆయనను ఒప్పించగలిగాను“ అని చెప్పుకొచ్చాడు. మ‌రి రీఎంట్రీలో వేణు ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి.

 


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

26 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

35 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago