Entertainment News సినిమా

`సీతారామం` వంటి బిగ్ హిట్‌ను చేతులారా వ‌దులుకున్న యంగ్ హీరోలు వీళ్లే?!

Share

రీసెంట్‌గా తెలుగులో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో `సీతారామం` ఒక‌టి. మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో డైరెక్ట‌ర్‌గా చేసిన చిత్ర‌మిది. హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తే.. రష్మిక మందన్న, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఆగ‌స్టు 5న తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. యుద్ధ నేపథ్యంతో సాగే ఓ అద్భుత‌మైన ప్రేమ క‌థా చిత్ర‌మిది. ఇందులో దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే భారత సైనికుడు లెఫ్టినెంట్‌ రామ్‌గా దుల్క‌ర్‌, ఆ సైనికుడిని ప్రేమించే అమ్మాయి సీత‌గా మృణాల్ త‌మ‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశారు.

ఇక తొలి షో నుండే పాజిటివ్ రివ్యూలు రావ‌డంతో.. క్లాస్ సినిమా అయిన‌ప్ప‌టికీ సీతారామం బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూల్ చేసింది. ఇప్ప‌టికీ స్ట‌డీగా ర‌న్ అవుతూ నిర్మాత‌ల‌కు, బ‌య్య‌ర్ల‌కు భారీ లాభాల‌ను అందిస్తోంది. ఇక‌పోతే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అదేంటంటే.. ఈ మూవీ దుల్క‌ర్ కంటే ముందే చాలా మంది హీరోల వ‌ద్ద‌కు వెళ్లింది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇద్ద‌రు యంగ్ హీరోల‌కు కూడా హ‌ను `సీతారామం` క‌థ‌ను వినిపించాడ‌ట‌. కానీ, ఆ ఇద్ద‌రు హీరోలు చేతులారా ఈ బిగ్ మిట్‌ను వ‌దులుకున్నార‌ట‌. ఇంత‌కీ ఆ హీరోలు ఎవ‌రో కాదు.. న్యాచుర‌ల్ స్టార్ నాని, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌. వీరిద్ద‌రూ `సీతారామం` క‌థ‌ను విన్నార‌ట‌. కానీ, వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న హ‌నుతో వ‌ర్క్ చేయ‌డం రిస్క్ అని నాని, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవ‌ని రామ్ `సీతారామం`ను రిజెక్ట్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.


Share

Related posts

Siddhanth Kapoor: కర్ణాటక పోలీసుల అదుపులో శ్రద్దా కపూర్ సోదరుడు సిద్ధార్ధ .. ఎందుకంటే..?

somaraju sharma

సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండె పోటుతో మృతి

Special Bureau

Nagarjuna: నాగ్ పక్కా కమర్షియల్ …లాభం లేకుండా ఏ పని చేయడు..!

GRK