టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల `లైగర్` బ్యూటీ అనన్య పాండేతో కలిసి పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7న పాల్గొన్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో విజయ్ దేవరకొండ వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలెన్నో షేర్ చేస్తున్నారు.
అలాగే తనకు సంబంధించిన పలు టాప్ సీక్రెట్‌ను కూడా బయట పెట్టాడు. ఇకపోతే ఈ షోలో హోస్ట్ కరణ్.. భారతదేశంలో నువ్వు అత్యంత ఇష్టపడే మహిళ పేరు చెప్పమంటూ విజయ్ ను ప్రశ్నించారు. అందుకు విజయ్ దేవరకొండ బదులిస్తూ.. తాను ఆరాధించే మరియు అభిమానించే ఏకైన మహిళ, హీరోయిన్ సమంత అంటూ పేర్కొన్నారు.
అంతేకాదు.. సమంతను డార్లింగ్ గా, అద్భుతమైన శక్తి కలిగిన మహిళగా అభివర్ణించారు. దీంతో విజయ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఇప్పటికే `మహానటి` మూవీలో విజయ్, సమంతలు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ `ఖుషి` మూవీ కోసం జతకట్టారు.
ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవలె చిత్రీకరణను ప్రారంభించిన మేకర్స్.. శరవేగంగా షూటింగ్ ముగించేయాలని చూస్తోంది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న విడుదల కానుంది.