NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Darling Movie Child Artist: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హిట్ లిస్ట్ లో ఉన్న చిత్రాల్లో డార్లింగ్ ఒకటి. ఏ కరుణాకరన్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రద్ధా దాస్, ప్రభు, ఎం ఎస్ నారాయణ, ముఖేష్ రిషి, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తులసి, శ్రీనివాస రెడ్డి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్ పై బీబీఎస్ఎన్ ప్రసాద్ డార్లింగ్ సినిమాను నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

2010 ఏప్రిల్ 23న విడుదలైన డార్లింగ్ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్‌ ను సొంతం చేసుకుంది. అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఛత్రపతి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ పరాజయాలను మూటగట్టుకున్న ప్రభాస్.. డార్లింగ్ మూవీ తో హిట్టు కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తమ్ముడుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? అతని పేరు గౌరవ్ దాసరి. డార్లింగ్ లో ప్రభాస్ మరియు గౌరవ్ మధ్య కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్ర‌భాస్ ను గౌరవ్ ఆట‌ప‌ట్టించే సీన్స్ తెగ నివ్విస్తాయి. డార్లింగ్ కన్నా ముందే తెలుగులో గౌర‌వ్‌ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాడు. మాస్‌ మహారాజా రవితేజ, అనుష్క శెట్టి జంటగా నటించిన బలాదూర్ సినిమాతో అతను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

ఆ తర్వాత నచ్చావులే, శ్రీరామరాజ్యం, డార్లింగ్ తో సహా తెలుగులో దాదాపు 20 చిత్రాల్లో బాల నటుడిగా యాక్ట్ చేశాడు. ఇకపోతే గౌరవ్ ఇప్పుడు చాలా పెద్దవాడు అయ్యాడు. అత‌ని తాజా పిక్స్ చూస్తే స్ట‌న్ అయిపోయారు. ప్ర‌స్తుతం ఒక రొమాంటిక్ ల‌వ్ స్టోరీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్ప‌టికే న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాడు. ఆపై అడపా దడపా చిత్రాల్లో చిన్నచిన్న క్యారెక్టర్స్ ను పోషిస్తున్నాడు.

ఇటీవ‌ల గౌర‌వ్ కు ఓ బిగ్ ప్రాజెక్ట్ లో యాక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. అదే క‌న్న‌ప్ప‌. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ పాత్ర‌ను పోషిస్తున్నాడు. మోహ‌న్ బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, మధుబాల, దేవరాజ్ ఇలా ఎంతో మంది స్టార్ కాస్ట్ క‌న్న‌ప్ప‌లో భాగం అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించే అవ‌కాశాన్ని గౌర‌వ్ కు క‌ల్పించాడు మంచు విష్ణు. ప్ర‌స్తుతం క‌న్న‌ప్ప చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

https://www.instagram.com/gaurav.dasari/?utm_source=ig_embed&ig_rid=f298a380-354f-4b21-b48b-d1dcf0d76a90

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju