మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం `సీతా రామం`. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్, ప్రియాంక దత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన.. విశేష స్పందనను దక్కించుకుంది. అయితే టాక్ బాగున్నా కలెక్షన్స్ పరంగా తొలి రోజు ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
కానీ, 2వ రోజు మాత్రం దుల్కర్ అదరగొట్టేశాడు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.1.50 కోట్ల షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు ఏకంగా రూ. 2.08 కోట్ల షేర్‌ను అందుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 3.63 షేర్‌ను దక్కించుకుంది. ఇక ఏరియాల వారీగా `సీతారామం` 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నిజాం: 1.39 కోట్లు
సీడెడ్: 0.37 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.55 కోట్లు
తూర్పు: 0.34 కోట్లు
పశ్చిమ: 0.20 కోట్లు
గుంటూరు: 0.30 కోట్లు
కృష్ణ: 0.30 కోట్లు
నెల్లూరు: 0.13 కోట్లు
———————————
ఏపీ+తెలంగాణ=3.58కోట్లు(6.55కోట్లు~ గ్రాస్)
———————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా- 0.35 కోట్లు
ఇతర భాషలు – 0.90 కోట్లు
ఓవర్సీస్- 1.85 కోట్లు
————————————
టోటల్ వరల్డ్ వైడ్ – 6.68 కోట్లు(13.30 కోట్లు~ గ్రాస్)
————————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 18.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 19.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వాలంటే మొదటి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.12.82 కోట్ల షేర్‌ను వసూల్ చేయాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!