NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ ఒకటి. వరంగల్ లో పుట్టిన ఈషా రెబ్బ.. హైదరాబాద్ లో పెరిగింది. ఎంబీఏ పూర్తి చేసింది. కాలేజీ డేస్ లోనే మోడలింగ్ లోకి ప్రవేశించిన ఈషా రెబ్బ.. నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2012లో `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ ను పోషించి తన నటనాప్రస్థానాన్ని ప్రారంభించింది. 2013లో వ‌చ్చిన `అంతకు ముందు ఆ తర్వాత` చిత్రంతో హీరోయిన్ గా మారింది.

2017లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన `అమీ తుమీ` చిత్రం ఈషా రెబ్బ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే సరైన అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగు అమ్మాయి కావడం వల్ల స్టార్ హీరోలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఈషా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తుంది. ఇటీవల ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హోదా అందుకునేందుకు తపన పడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈషా రెబ్బ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కెరీర్ పరంగా ఎదుర్కొన్న స్ట్రగ్గుల్స్, చిన్నతనంలో ప‌డిన ఆర్థిక కష్టాలు త‌దిత‌ర అంశాల గురించి వివరించింది. ఈ క్రమంలోనే డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు నమ్మి తాను దారుణంగా మోసపోయిన విష‌యాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని సంచల‌న నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈషా రెబ్బ‌ ఒక సినిమా చేసింది. అదే `అరవింద సమేత వీర రాఘవ`. జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే ఈ చిత్రంలో జంటగా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం 2018 లో విడుద‌లై భారీ విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 150 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను అందుకుంది.

ఈ చిత్రంలో పూజా హెగ్డే కు సోదరి పాత్ర‌లో ఈషా రెబ్బ‌ నటించింది. అయితే ఇంత పెద్ద సినిమాలో నటించినప్పటికీ తాను ఏమాత్రం హ్యాపీగా లేనంటూ ఈశా రెబ్బ‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. `త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. మీరు ఒకరిని ఆయన అన్నారు. తొలిత నేను నో చెప్పాను. నేను మెయిన్ లీడ్ గా మాత్రమే చేద్దామనుకుంటున్నానని ఆయ‌న‌తో అన్నాను. కానీ త్రివిక్రమ్ క‌థ మొత్తం చెప్పి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లో మీది ఒకటి అని అన్నారు.

దాంతో షూటింగ్ స్టార్ట్ కావ‌డానికి ఒక్కరోజు ముందు నేను ఓకే చెప్పాను. నా కెరీర్ లో అరవింద సమేత నే పెద్ద సినిమా. కొత్తగా అనిపించింది. షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు సరదాగా గడిచిపోయింది. విడుదలకు ముందు నన్ను సెకండ్ హీరోయిన్ గా అనౌన్స్ చేస్తానని త్రివిక్రమ్ అన్నారు. కానీ అలా చేయలేదు. ఎన్టీఆర్ తో నాకు సాంగ్ ఉంటుందని అన్నారు. అది క్యాన్సిల్ అయింది. సినిమాలో నాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను కూడా ఎడిటింగ్ లో కట్ చేసేశారు. చాలా బాధ కలిగింది. ఒకవేళ నన్ను సెకండ్ లేడ్‌ గా అనౌన్స్ చేసి ఉంటే కచ్చితంగా అది నాకు కెరీర్ కు హెల్ప్ అయ్యేది` అంటూ ఈశా రెబ్బ‌ చెప్పుకొచ్చింది. అయితే నేరుగా ఆమె త్రివిక్ర‌మ్ గురించి నెగ‌టివ్ కామెంట్స్ చేయ‌లేదు. కానీ హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి మోసం చేశారని పరోక్షంగా ఈశా రెబ్బ‌ కుండ‌బదులు కొట్టేసింది. దీంతో ఆమె కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju