NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Elections Results 2024: దేశవ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమరం నిన్నటితో సమాప్తం అయ్యింది. ఈ ఎన్నికలలో చివరిదైనా ఏడ దశ పోలింగ్ నిన్న ముగిసింది. ఇక ముగిసింది ఓట్ల లెక్కింపు, ఫలితాలే. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈసారి కొన్ని సినిమా ధియేటర్లు కూడా ఎన్నికల ఫలితాల లైవ్ను ప్రదర్శించనున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని నగరాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఎలక్షన్ రిజల్ట్స్ 2024 పేరుతో ఈ ఫలితాల లైవ్ను జూన్ 4న కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రచారం చేయనున్నాయి.

Elections Results 2024
Elections Results 2024

ప్రస్తుతం ముంబై, న్యూఢిల్లీ, పూణే నగరాల్లో ఈ ఎలక్షన్ షోలా కోసం థియేటర్లలో టిక్కెట్లు ఆన్లైన్ బుకింగ్ కు వచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికల ఫలితాలు లైవ్ ఏ థియేటర్లో అయినా ప్రదర్శిస్తాయా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల లైవ్ కోసం థియేటర్లు కేటాయింపు లేదు. ప్రస్తుతం ముంబై మరియు ఢిల్లీ, పూణే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ షోలు ఏర్పరిచాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాల లైవ్ షో థియేటర్లలో ఆరు గంటల పాటు ఉండనుంది. ఉదయం 9 గంటలకు ఇది మొదలవుతుంది. ముంబై, ఢిల్లీ,పూణే లో ఇప్పటివరకు బుకింగ్ ఓపెన్ అయిన థియేటర్లలో ఈ ఎలక్షన్ షో టికెట్ ధరలు రూ.99 నుంచి 3 మధ్య ఉన్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్ లో రిలీజ్లు పెద్దగా లేవు. రాజ్ కుమార్ రావ్, జాన్వి కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం ఈ వారం రిలీజ్ అయింది. ఇది తప్ప మరే సినిమా రన్ అవ్వడం లేదు. దీంతో ఈ డ్రై పీరియడ్ లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శించేందుకు కొన్ని థియేటర్లు సిద్ధమయ్యాయి. ఏడాది జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి థియేటర్లలో నుంచి స్పందన దక్కింది. దీంతో ఎన్నికల ఫలితాలు లైవ్ షోలు వేసేందుకు కొన్ని థియేటర్లు ముందుకు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు లైవ్ నువ్వు థియేటర్లలో ప్రదర్శించడం పైసని వర్గాల్లో విధంగా చర్చలు జరుగుతున్నాయి.

ఆందోళన కూడా ఎక్కువగానే ఉంది. ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన పార్టీల మద్దతుదారులు థియేటర్ను ధ్వంసం చేసే ప్రమాదం కూడా ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. వివిధ పార్టీల మద్దతుదారుల మధ్య థియేటర్లలో గొడవలు జరుగుతాయని ఆలోచన కూడా వ్యక్తమౌతుంది. మరి థియేటర్లలో జూన్ 4న ఎన్నికల ఫలితాల ప్రదర్శనకు ఎటువంటి రెస్పాన్స్ దక్కుతుందో వేచి చూడాలి. ఇప్పటికే ఎన్నికలపై పలువురు నటీనటులు కూడా స్పందించారు. నిజానికి థియేటర్లకి ఎన్నికలకి అస్సలు సాపత్యం లేదు. కానీ ప్రెసెంట్ జనరేషన్ లో సినిమాలు మరియు రాజకీయాలు అక్కా చెల్లెలుగా మారిపోయాయి. ఒకదానికి కష్టం వస్తే మరొకటి అండగా నిలబడుతుంది. అందువల్లే సినిమాలు చూసే తెరపైనే పొలిటికల్ రిజల్ట్స్ కూడా వేసేందుకు సిద్ధమయ్యారు.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju