Ennenno Janmala Bandam: ఇప్పుడు రండి లోపలికి అని ఖుషి అంటుంది. బాబు వదిన గారు గుడి గుడికి కాళ్లకు బలపం కట్టుకొని తిరిగారు అని సులోచన అంటుంది.ఎంత గొప్ప కూతుర్ని నాకు బహుమతిగా ఇచ్చారంటే వేద లేకపోతే నేను లేను అని యష్ అంటాడు. పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను నాకు తెలియదు ఖుషి వాళ్ళ నేను మీ జీవితంలోకి వచ్చే అవకాశం నాకు కలిగింది అని వేద అంటుంది. అది నీ అదృష్టం కాదు వేద నా అదృష్టం భర్తల కోసం త్యాగాలు చేసే భార్యలు ఉండొచ్చు కానీ నా ఊపిరే నీ ఊపిరిగా నువ్వు పడిన తపన నువ్వు నాకు చేసిన సహాయం నేను మాటల్లో చెప్పలేను వేద అని యాష్ అంటాడు.

అది నా బాధ్యత అని వేద అంటుంది. లేదమ్మా వేద బాధ్యత అనేది ఓ పదం ఉందో లేదో నాకు తెలియదు కానీ దానికి అర్థం నువ్వే వేద ఒక అత్తగారిగా నేను నీకు ఏమీ చేయలేకపోయాను అని మాలిని అంటుంది. నాన్న మీ అందరి సపోర్ట్ వల్లే నేను ముందుకు అడుగు వేయగలిగాను పిల్లలను అమ్మ వాళ్ళ బాధ్యత అంతా మీరు తీసుకున్నారు కాబట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను అని వేద అంటుంది. అమ్మ నాకు ఒక డౌటు జలసి అంటే ఏమిటి అని కుషి అడిగింది. అసూయ అంటారమ్మ అని వేద అంటుంది. అది మంచిదా కాదా అది పోవాలంటే ఏం చేయాలి అమ్మ నేను ఒకటి చెప్పనా పేరు మార్చుకుంటే సరిపోతుంది అని ఖుషి అంటుంది. పేరు మార్చుకున్న నువ్వు నాకన్నా గొప్ప దానివి కావాలి అని వేద అంటుంది. కట్ చేస్తే వేద లోపలికి వచ్చి బిజీనా కొంచెం ఇటు చూస్తారా అని వేద అంటుంది.

ఏంటది మల్లెపూల ఇవి నీ తలలో పెట్టాలా అని యష్ అంటాడు. ఏవండీ నాకు మామిడికాయలు తినాలనిపిస్తుంది అని వేదా అంటుంది. నాకు కూడా తినాలనిపిస్తుంది వేదా అని యష్ అంటాడు. నేను చెప్పేది కాస్త వింటారా అని వేద గట్టిగా అంటుంది. వింటున్నాను కదా ఎందుకు అరుస్తున్నావ్ అని యష్ అంటాడు.నేను గుడికి వెళ్లాను అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోయాను అప్పుడు ఒక ఆవిడ నా మొహం మీద నీళ్లు చల్లి లేపి నా చేయి పట్టుకుని చూసి ఒక విషయం చెప్పింది నా కడుపులో ఒక నలుసు పడిందని అని వేద అంటుంది. అయ్యో ఒక టాబ్లెట్ వేసుకో పోయావా అనియష్ అంటాడు. కడుపులో నలుసు పడితే నన్ను టాబ్లెట్ వేసుకోమంటారా అని వేద అంటుంది. అప్పుడెప్పుడో నాకు కడుపులో నొప్పి వస్తే టాబ్లెట్ వేసావు కదా అని యష్ అంటాడు. ఓ నా మొగుడా నేను అమ్మని కాబోతున్నాను అని వేద అంటుంది.

నిజంగానా మరి ఇన్ని రోజులు చెప్పలేదే అని యష్ అంటాడు. చెప్పాలని అనుకున్నాను కానీ పరిస్థితులు అడ్డొచ్చాయి అని వేద అంటుంది. అడ్డంకులు తొలిగాయి అన్ని మంచి రోజులే వచ్చాయి ఈ విషయం అమ్మ వాళ్లకి తెలిస్తే చాలా సంతోషపడతారు అని యష్ అంటాడు. వద్దండి ఇప్పుడే చెప్పకండి చేయి చూసి ఆవిడ చెప్పింది డాక్టర్ తో ఒకసారి చెక్ చేపించుకున్న తరువాత వాళ్ల అందరికీ కూర్చోబెట్టి చెబుదాము అని వేద అంటుంది. సరే అలాగే చెబుదాము కానీ నా పొట్ట ఉబ్బుతుంది ఎలాగా అని యష్ అంటాడు. పొట్ట పెరగాల్సింది నాకు మీకు కాదు అని వేద అంటుంది. కట్ చేస్తే లాయర్ గారు పిలవండి వాళ్ళని అని నీలాంబరి అంటుంది.ఇది చట్టరీత్యా కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు అభిమన్యు అనే వ్యక్తి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేక తన యావదాస్తిని రుణదాత అయిన నీలాంబరి కి సదరు వ్యక్తి అభిమన్యు స్వధస్థాలతో రాశి ఇచ్చిన హక్కు పత్రం అని లాయర్ అంటాడు. ఇది మోసం అన్యాయం అని కైలాష్ అంటాడు. నీలాంబరి తుపాకి తీసి దీనికి అవేవీ తెలియవు ప్రాణాలు మాత్రమే తీస్తుంది మీరు పూర్తి చేయండి లాయర్ గారు అని నీలాంబరి అంటుంది. బ్యాంకు ఎకౌంట్లు మిగిలిన ఆస్తులు నీలాంబరికే చెందుతాయని అలా కాదని ఎవరైనా అడ్డం వస్తే పోలీసులు చట్టరీత్యా అరెస్టు చేస్తారని సగరు అభిమన్యు తిరిగి వచ్చిన తనకు ఎలాంటి హక్కు లేదని కోర్టు వారు తీర్పు ఇచ్చారు అని లాయర్ అంటాడు.

ఏ నా తమ్ముడు లేని టైం చూసి ఇలా చేస్తావా నీ సంగతి మా తమ్ముడు వచ్చినాక చూసుకుంటాడు అని వాళ్ళ అక్క అంటుంది. మీలాంటి వాళ్ళకి నా ఇంట్లో స్నానం లేదు ముష్టెత్తుకొని బతుకుతారో మూసీ నదిలో పడి చస్తారు అది మీ ఇష్టం మీ లగేజీ సర్ది పెట్టాను పొండి ఇక్కడి నుంచి అని నీలాంబరి అంటుంది. చెప్తానే నీ సంగతి మళ్ళీ వస్తా అనుకుంటూ వెళ్లిపోతారు అభివాళ్ళ అక్క కైలాష్. కట్ చేస్తే ఏమండీ మీ ఫోను అని వేద ఇస్తుంది. నేను వెళ్ళను ఆఫీస్ కి అని యాష్ అంటాడు. ఓహో కుదరదు అని అనకూడదుమీరు ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే మొగుణ్ణి పొంగున కట్టేసుకుంది అనే చెడ్డ పేరు నాకు వస్తుంది అని వేద అంటుంది. నీకెందుకు చెడ్డ పేరు వస్తుంది నువ్వు వెళ్లి రెడీ అయి రా మనం హాస్పిటల్ కి వెళ్దాము అని యష్ అంటాడు.

మనం ఇద్దరం ఏమనుకున్నాము వాళ్లను కూర్చోబెట్టి చెబుదాము అనుకున్నాను కదా కానీ ఇప్పుడు హాస్పటల్ చుట్టూ తిరిగితే వాళ్లకు అనుమానం వస్తుంది కదా కాబట్టి మీరు ఆఫీస్ కి వెళ్లాల్సిందే అని వేద అంటుంది. సరేలే వెళ్తాను కానీ మొగుడ్ని ఇలాగేనా ఆఫీసుకు పంపించేది అన్ని ఇచ్చి పంపించాలి కదా అని యష్ అంటాడు. అన్ని ఇచ్చాను కదా మీ ఫోను లాప్టాప్ ఇంకేముంది అని వేద అంటుంది. గుర్తుకు తెచ్చుకో లాలీ పాప ఇవ్వాలి కదా అని యష్ అంటాడు. ఆశ దోశ ఏం కాదు అని వేదా అంటుంది. కట్ చేస్తే హాస్పటల్ నుంచి యష్ కి ఫోన్ చేస్తుంది డాక్టర్ గారు వేద అశ్విని గారు హాస్పిటల్ కి వచ్చి చెక్ అప్ చేయించుకున్నారు కదా మీరు ఒకసారి హాస్పిటల్ కి వస్తే ఒక విషయం గురించి చెప్పాలి అని డాక్టర్ అంటుంది. డాక్టర్ గారు వేద గురించి ఏమో చెప్పాలి అన్నారు ఏంటది అని యష్ అడుగుతాడు. వేద గర్భసంచి కొంచెం లూజుగా ఉంది ప్రెగ్నెన్సీ నిలుస్తుందో లేదో అది తెలియదు అని డాక్టర్ అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్లీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం