Bangaram Shanti: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వేదికగా చాలామంది తమకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు వెండితెర లేదా టీవీలో కనిపిస్తే ఫేమస్ అయ్యే పరిస్థితి ఉండేది. లేదా పబ్లిక్ లో ఏదైనా వేదికపైకి టాలెంట్ చూపించాలి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా.. ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలు అయిపోతున్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఉపయోగించుకుని తమ టాలెంట్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ తరహాలో టిక్ టాక్ దుర్గారావు, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చా, జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ.. టాలెంట్ చూపించుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయ్యారు.
ఇదే కోవలోకి ఈ ఏడాదిలో “బంగారం చెప్పనా” అంటూ ఇంటర్నెట్ నీ షేక్ చేసి పడేసింది శాంతి అనే అమ్మాయి. ”బంగారం ఒకటి చెప్పనా.. చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది. అలాగే నా ప్రేమకు.. నీ ప్రేమను పంచితేనే కదా.. నా మనసులో బాధ నీకర్థమయ్యేది” అంటూ డైలాగ్ చెబుతూ పెద్ద హైలైట్ అయింది. ఇక శాంతి గురించి చెప్పాలంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పదో తరగతి చదివింది. ఒకపక్క దుకాణంలో పనిచేస్తూనే నటన మీద ఆసక్తి ఉండటంతో ఇంస్టాగ్రామ్ రిల్స్ లో తన టాలెంట్ చూపించి… కొద్ది నెలలకే సెలబ్రిటీగా మారిపోయింది.

బంగారం ఒకటి చెప్పనా అంటూ శాంతి.. తన రీల్స్ లో నవ్విస్తున్నా గాని ఆమె వాస్తవ జీవితంలో.. ఎవరికీ తెలియని నిజాలు ఉన్నాయి. ఎంతో చలాకీగా రీల్స్ చేసే శాంతి కుటుంబ పరిస్థితి చూస్తే ఎవరైనా జాలీ పడాల్సిందే. మతిస్థిమితం లేని తండ్రి శాంతి చిన్నప్పుడు ఇంటి నుండి వెళ్లిపోయారట. ఈ క్రమంలో కన్న తండ్రి కోసం చాలా సంవత్సరాలు వెతికినా కానీ కనబడలేదు. దీంతో చిన్ననాటి నుండి తల్లే మొత్తం బాధ్యత తీసుకుని.. తనని తన తమ్ముడిని చదివించడం జరిగిందట. ఈ క్రమంలో తండ్రి విషయంలో తల్లి అనేక అవమానాలకు గురైనట్లు తెలియజేసింది. ఇళ్ళలో పనులు చేస్తూ తమని తల్లి పెంచిందని శాంతి చెప్పుకొచ్చింది. చిన్నతనంలో ఇల్లు లేక గుడిలో పడుకునే వాళ్ళం. అద్దెకు ఎవరు కూడా ఇల్లు ఇచ్చేవారు కాదు. అమ్మకి తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళ ట్రీట్మెంట్ కోసం సాయశక్తుల కష్టపడుతున్నాను అంటూ శాంతి తన జీవితంలో కుటుంబంలో ఉన్న కష్టాలను తెలియజేసింది. నటనపై ఎంతో ఆసక్తి కలిగిన శాంతి… ప్రస్తుతం జబర్దస్త్ వంటి షోలలో కనిపిస్తుంది.