టాలీవుడ్ కింగ్ నాగార్జున సోలోగా నటించిన తాజా చిత్రం `ది ఘోస్ట్`. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.
ఇందులో సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.
ఇక ఈ సినిమా విషయంలో నాగార్జునకు సొంత అభిమానుల నుంచే ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ఆరు పదుల వయసులో ఇలాంటి యాక్షన్ సినిమాలు అవసరమా అంటూ నాగార్జునకు అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చురకలు వేస్తున్నారు.
ఇకపై ఇలాంటి యాక్షన్ సినిమాలు వద్దంటూ ఆయనకు సూచనలు కూడా చేస్తున్నారు. దీంతో సినిమా పోయింది అన్న బాధ కంటే.. సొంత అభిమానులు నుంచి వస్తున్న విమర్శలు నాగార్జునను ఎక్కువ కృంగదీస్తున్నాయని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఏదేమైనప్పటికీ నాగార్జునకు ఓ అర్జెంట్ హిట్ అవసరం ఎంతైనా ఉంది.
https://newsorbit.com/entertainment-news/nagarjuna-open-comments-on-his-political-entry.html