NTR :`అరవింద సమేత వీర రాఘవ`తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత `ఆర్ఆర్ఆర్`తో ప్రేక్షకులను పలకరించాడు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మల్టీస్టారర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అఖండ విజయం సాధించింది. దీంతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవడమే కాదు పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు కూడా పొందాడు ఎన్టీఆర్.
ఇక ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కొరటాల శివతో చేసేందుకు ఎప్పుడో గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాడు. ఆయన కెరీర్లో ఇది 30వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని గత ఏడాది అధికారికంగా అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితం కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించనున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఇప్పటి వరకు ఇందులో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది క్లారిటీ రాలేదు.
అలియా భట్, రష్మిక మందన్నా, సమంత, జాన్వీ కపూర్, దిశా పటానీ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ, ఎవ్వరూ ఫైనల్ కాలేదు. సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఏర్పడటం సర్వ సాధారణం. కానీ, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ కు హీరోయిన్ దొరకని పరిస్థితి రావడం ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడీ ఈ విషయంపైనే అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. మరి `ఎన్టీఆర్ 30`కి హీరోయిన్ కష్టం ఎప్పుడు తీరుతుందో చూడాలి.