ఫరియా అబ్దుల్లా.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. `జాతిరత్నాలు` మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ కెవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈ మూవీ సాధించిన విజయంతో ఫరియా దశ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ, అలా జరగడం లేదు. అడపా తడపా ఆఫర్ల మినహా.. భారీ ప్రాజెక్ట్‌ల నుండి ఈమెకు అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజకు జోడీగా `రావణాసుర`లో నటిస్తోంది. `బిచ్చగాడు` ఫేమ్ విజయ్ ఆంటోనికి జోడీగా `వల్లి మయిల్` అనే సినిమా చేస్తోంది.
వీటితో పాటే ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్‌గా మారుతోంది. ఈ మధ్యే ఫరియా అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య కలిసి నటించిన `బంగార్రాజు` చిత్రంలో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది. అయితే ఇప్పుడు ఈమెకు మరో ఐటెం సాంగ్ చేసే అలవాటు వచ్చిందట. అది కూడా అక్కినేని హీరో మూవీ నుండే అట.
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో `ఏజెంట్` అనే మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంటే.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందట. ఆ సాంగ్ కోసం మేకర్స్ ఫరియాను ఎంపిక చేశారని.. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని నెట్టింట టాక్ నడుస్తోంది. దీంతో ఫరియాను అక్కినేని హీరోలు వదిలేలా లేరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…