`బింబిసార‌`పై ఫ‌స్ట్ రివ్యూ.. క‌ళ్యాణ్ రామ్ హిట్ కొడ‌తాడా..?

Share

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే తొలిసారి చేసిన హిస్టారికల్ మూవీ `బింబిసార‌`. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ వశిష్ఠ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించారు. కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తే.. చిరంతన్ భట్, కీర‌వాణి సంగీతం అందించారు.

క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు జీవ‌ర క‌థ ఆధారంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడు కాలంతో వెనక్కి ప్రయాణించి, నేటి ప్రపంచంలోకి వచ్చి తనకు చెందిన నిధిని కాపాడుకోడమే ఈ సినిమా కథాంశం.

`బింబిసార‌` బిజినెస్ ఇంత త‌క్కువా..? క‌ళ్యాణ్ రామ్ టార్గెట్ చిన్న‌దే!

ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్లు సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. అలాగే మ‌రోవైపు మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ మంచి బ‌జ్‌ను క్రియేట్ చేశారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాల‌ని అభిమానులే కాకు సినీ ప్రియులు సైతం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తుంది.

ఇక‌పోతే ఈ సినిమాపై ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది. ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యులు ఉమైర్ సంధు ‘బింబిసార’ మూవీ ఫస్ట్ రివ్యూను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వదిలారు. విజువల్ పరంగా, కథ పరంగా సినిమా అద్భుతంగా ఉందని తెలిపారు. హీరో కళ్యాణ్ రామ్‌కి, టాలీవుడ్‌కు ఇది అదిరిపోయే కమ్‌బ్యాక్ అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈయ‌న రివ్యూతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగిపోయాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను అందుకుని క‌ళ్యాణ్ రామ్ హిట్ కొడ‌తాడా..? లేదా..? అన్న‌ది చూడాలి.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

6 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

15 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

52 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

56 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago