Puri Jagannadh: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. మధ్యలో వరుస ఫ్లాపులు పడినా `ఇస్మార్ట్ శంకర్`తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఈయన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో రెండు చిత్రాలు చేస్తున్నారు.
అందులో ఒకటైన `లైగర్` ఇప్పటికే షూటింగ్‌ను కంప్లీట్ చేసుకోగా.. మరొకటి అయిన `జనగణమన` ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ఇకపోతే పూరీ ఓవైపు దర్శకుడిగా, మరోవైపు పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా సత్తా చాటుతున్నారు. ఈ బ్యానర్ నిర్మాణ బాధ్యతలని ప్రముఖ హీరోయిన్ ఛార్మి చూసుకుంటూ వస్తోంది. పూరీ తెరకెక్కిస్తున్న ప్రతి సినిమాకి ఛార్మినే ప్రొడక్షన్ వర్క్ ను చేస్తోంది.
పూరీ ఎక్కడ ఉంటే అక్కడ ఛార్మి కనిపిస్తోంది. బయట పార్టీల్లో సైతం వీరిద్దరూ జంటగా కనిపిస్తున్నారు. దాంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. అంతేకాదు, పూరీ జగన్నాథ్ తన భార్య లావణ్యకు విడాకులు ఇచ్చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంలో పూరీ తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరీ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. `చోర్ బజార్` సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆకాశ్.. తల్లిదండ్రుల విడాకుల వార్తలపై స్పందించారు.
`అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్ట్ మమ్మీనే. వాళ్లది లవ్ మ్యారేజ్. మా పేరెంట్స్ లవ్‌లో ఉన్న సమయంలో నాన్న అమ్మకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు. హా, వచ్చేస్తానంది అమ్మ. నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే.. క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసింది. ఇంతలా ప్రేమించేవాళ్లు ఎలా విడిపోతారు. కొందరు టైంపాస్ కోసమే తప్పుడు వార్తలు రాస్తున్నారు. వాటిలో ఎటువంటి నిజం లేదు.` అంటూ ఆకాశ్ చెప్పుకొచ్చాడు.
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…
Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…