Entertainment News సినిమా

వైర‌ల్ వీడియో: సప్తగిరి కాళ్ళకు దణ్ణం పెడతానన్న బాల‌య్య‌.. అస‌లేమైందంటే?

Share

`ఏంటీ.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి కాళ్ళ‌కు దణ్ణం పెడతానని అన్నారా..?` అన్న సందేహం పైన టైటిల్ చూడ‌గానే రాక మాన‌దు. అయితే మీ సందేహం నిజ‌మే. బాల‌య్య‌నే ఆ మాట‌లు అన్నారు. అస‌లేమైందంటే.. `అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం బాల‌య్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

`ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వరలక్ష్మి శ‌ర‌త్ కుమార్‌, కన్నడ నటుడు దునియా విజయ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. స‌ప్త‌గిరి కూడా ఇందులో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ టర్కీలోని ఇస్తాంబుల్‌లో జ‌రుగుతోంది.

conversation between balakrishna and saptagiri
conversation between balakrishna and saptagiri

అయితే షూటింగ్ మధ్య చిన్న బ్రేక్ దొర‌క‌డంతో బాలకృష్ణ.. కమెడియన్ సప్తగిరిని డైలాగ్ వార్ కి ఆహ్వానించారు. ఇక బాలయ్య పౌరాణిక చిత్రంలోని ఒక భారీ డైలాగ్ ని చెబుతూ ఆగిపోగా.. సప్తగిరి మాత్రం ఆ డైలాగుని తడబడకుండా చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

సప్తగిరి డైలాగులు చెప్పిన తీరుకు బాలకృష్ణ ఫిదా అయ్యారు. ఈ క్ర‌మంలోనే `ఒకసారి నీ కాళ్ళు పైకి ఎత్తరా. దణ్ణం పెడతా` అని అన‌డ‌తో.. ఒక్కసారిగా సప్తగిరి షాక్ అయ్యాడు. వెంట‌నే బాలకృష్ణ కాళ్ళకే స‌ప్త‌గిరి నమస్కరించి కిందనే కూర్చున్నాడు. న‌వ్వులు పూయిస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.


Share

Related posts

‘సింగిల్ స్క్రీన్ ధియేటర్లు..’ ప్రేక్షకులకు ఇక జ్ఞాపకాలేనా..?

Muraliak

“నాట్యం” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మెగా కోడలు..!

Teja

టాలీవుడ్ లో గేర్ మార్చబోతున్న ఇలియానా ..?

GRK